మళ్లీ అదే నోటి దూల.. మరింత కండకావరం.. కాకపోతే టార్గెట్ మాత్రం.. హిందూ దేవీ దేవతలే! ఒకడు రాముడినంటాడు.. మరొకడు కృష్ణుడిని అంటాడు.. కొవ్వు మరీ ఎక్కువైన ఇంకొకడు తల్లి లక్ష్మీదేవిని.. దుర్గమ్మను కామెంట్ చేస్తాడు.. మరొకడు అయ్యప్పపై అవాకులు చెవాకులు పేలుతాడు. ఈ దుర్మార్గమంతా ఏ పాకిస్తాన్ లోనో కాదు.. హిందువులు మెజారిటీగా ఉండే హిందూస్తాన్ లోనే..! ఈ కోవలోనే కళ్లు బాగా నెత్తికెక్కిన ఓ ప్రబుద్ధుడు చదువుల తల్లి సరస్వతిని అనరాని, వినరాని కూతలతో నిందించాడు. అంతేకాదు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతోపాటు అయ్యప్పను అసభ్యంగా దూషించాడు. ఎందుకంటే.. ఇక్కడ నాయకులకు హిందువుల ఓట్లు కావాలి, వారు సమర్పించే దేవాదాయం కావాలి… మనోభావాలంటే మాత్రం లెక్క లేదు. ఇంకే మతంపైన ఈగ వాలినా గంగవెర్రులెత్తిపోయే ఖాకీలు.. ఇదిగో హిందూ దేవతలపై ఇంత అసభ్యత ప్రదర్శించినా చీమ కుట్టినట్టైనా ఫీల్ కారు… బహుశా అదే ఈ నీచుల ధైర్యమని హిందూ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులే అయినా.. హిందూ దేవుళ్లంటే కొందరికి లోకువ అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది వాగుతున్నారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అలాంటి వాడే ఏనుగుల అఖిల్ అంటూ హిందూత్వవాదులు మండిపడుతున్నారు. బ్రహ్మ, విష్ణు, శివుడికి సంబంధించి తాజాగా ఇతను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు.
‘అఖిల్ జేమ్స్ ది గ్రేట్’ పేరుతో ఉన్న ఇతడి ట్విట్టర్ అకౌంట్, యూట్యూబ్ ఛానల్ ఆధారంగా.. ట్రూ కాలర్ లో నెంబర్ సెర్చ్ చేసి చూస్తే ఏనుగుల అఖిల్.. ఊరు పార్వతీపురం అని చూపిస్తోంది. ఇతనికి ‘రాష్ట్ర’ కూడా ఫోన్ చేసింది. కానీ, లిఫ్ట్ చేయలేదు. ఇతర మతాల గురించి చిన్న మాట అంటే చాలు.. నానా రచ్చ చేసే నాయకులు, పోలీసులు.. హిందూ దేవుళ్లపై ఇలా ఏదిబడితే అది మాట్లాడుతూ.. చరిత్రను వక్రీకరిస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు హిందువులు.
హిందూ పండుగలపై, హిందువులపై, దేవుళ్లపై చాలాకాలంగా కొందరు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఓవైపు విచ్చలవిడిగా మతమార్పిడులు, లవ్ జిహాద్ ఘటనలు వెలుగుచూస్తున్నా పట్టించుకోకుండా.. అనేక అంశాలను తొక్కి పెట్టేశారని.. కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే అఖిల్ లాంటి వారు ఇలా రెచ్చిపోతూ.. హిందువులపై నోటికొచ్చింది వాగుతున్నారని మండిపడుతున్నారు. వెంటనే, అఖిల్ ను అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించాలని హిందూ సంఘాలు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.
భారత్ హిందూ దేశం. హిందూ సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిన నేల. ఎందరో ఈ దేశంపై దండెత్తారు. శకులు, తురుష్కులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్, ఫ్రెంచ్, డచ్, బ్రిటీష్.. ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేశారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేసేందుకు చూశారు. మత మార్పిడులు, హిందూత్వంపై ద్వేషం ఇలా ఎన్నో చేశారు. వారి మూలాలను ఇప్పటికీ కొందరు గుర్తు చేస్తూ.. వారి ఆలోచనలను అనుసరిస్తూ.. ఇలా హిందూత్వంపై పడి ఏడుస్తున్నారని అంటున్నారు హిందూ సంఘాల నేతలు.