మంత్రి రోజా మీద టీడీపీ లీడర్ బండారు సత్యనారాయణ చేసిన కామెంట్లు ఎంతలా వైరల్ అయ్యాయో తెలుసు. బ్లూ ఫి**లి**మ్స్ లో నటించిన రోజా టిడిపిలో ఉన్నప్పుడు, క్యాంపెయిన్ కి వచ్చి ఎటువంటి పనులు చేసేదో తెలుసా అని కామెంట్లు చేశారు బండారు సత్యనారాయణ. బండారు సత్యనారాయణ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. కన్నీళ్లు పెట్టుకుని రోజా సత్యనారాయణ పై మండిపడింది. మహిళా కమిషనర్ బండారు సత్యనారాయణ కి నోటీసులు ఇచ్చారు. బండారు సత్యనారాయణ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. రోజా కి సపోర్ట్ గా కుష్బూ, రాధా, మీనా, నవనీత్ కౌర్, రమ్యకృష్ణ వంటి హీరోయిన్లు నిలబడ్డారు.
సభ్య సమాజం తలదించుకునేలా ఆయన కామెంట్లు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అన్న మాటల్ని వెనక్కి తీసుకోవాలని.. రోజాకు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేసారు. టాలీవుడ్ నుండి ఒక్కరు కూడా రోజాకి సపోర్ట్ ఇవ్వలేదు. ఆ విషయం మీద మాట్లాడలేదు కూడా. దీని వెనుక కారణం ఏంటని చర్చ మొదలైంది. ప్రధాన కారణం ఏంటంటే టాలీవుడ్ పొలిటికల్ ఈవెంట్ల మీద స్పందించట్లేదు.
Also read:
ఇదే చర్చ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా వచ్చింది. సప్త సాగరాలు దాటే సినిమా ప్రమోషన్ ఈవెంట్లో సురేష్ బాబుకి ఈ ప్రశ్న ఎదురయింది. చంద్రబాబు అరెస్టు మీద మీ అభిప్రాయం ఏంటంటే చిత్ర పరిశ్రమ నాన్ పొలిటికల్. నాన్ రిలీజినల్. నటులు పొలిటికల్ కామెంట్లు చేయరని చెప్పారు. రాజకీయాల గురించి ఎవరైనా మాట్లాడితే అది వాళ్ళకి వ్యక్తిగతం. పరిశ్రమ తరపునైతే పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం కుదరదని చెప్పారు. రోజా విషయంలో కూడా ఈ కారణంగానే టాలీవుడ్ మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.