Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
మనుషులు బ్రతకడానికి పుట్టించుకొన్న కులాలు.. వారి మధ్య చిచ్చు పెడుతున్నాయి. నేటి సమాజంలో కులాల పేరు చెప్పుకొని జరిగే హింస మాటలకు అందకుండా ఉంది. మతం అనేది మానవత్వాన్ని పెంచేలా ఉండాలి.. కానీ మంట పుట్టించేలా ఉండకూడదని పెద్దలు హితబోధ చేసేవారు. కొందరు మతం ఒక విశ్వాసం మాత్రమే అంటారు.
ఇక సాధారణంగా ముస్లింలు అల్లాను తమ దేవుడిగా కొలుచుకొంటారు. కానీ అసోంలో ఓ ముస్లిం కుటుంబం (Muslim Family) దుర్గామాత
(Durgamatha)కి పూజలు (Puja) నిర్వహిస్తోంది. అనంతరం దుర్గా మాత ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. దాదాపుగా ఈ సంప్రదాయాన్ని 290 ఏళ్లుగా కొనసాగిస్తోంది.. అసోం (Assam)లోని శివసాగర్ జిల్లాలో ఉన్న దేవి డౌల్ ఆలయంలో దుర్గా మాతకు మహా అష్టమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించింది ముస్లిం దౌల్లా ఫ్యామిలీ..
పూజా అనంతరం ఆలయ పూజారి.. దుర్గామాత ప్రసాదాన్ని సంప్రదాయబద్ధంగా ముస్లిం దౌల్లా ఫ్యామిలీకి అందించారు. దాంతోపాటు కాన్సెంగ్ బోర్పాత్ర గోహైన్ కుంటుంబానికి కూడా ఈ ప్రసాదాన్ని అందజేశారు. కారణం ఏంటంటే.. దౌల్లా ముస్లిం కుటుంబానికి.. అహోం రాజుల పరిపాలన నుంచే దుర్గా పూజా ప్రసాదం అందించడం అనేది అనవాయితీగా వస్తోందని చెబుతున్నారు.
శివ సింహ అనే రాజు.. కలంచుపారియా గ్రామంలో ఓ చెరువును తవ్వించడంతో పాటు ఈ దుర్గా మాత ఆలయాన్ని కూడా కట్టించినట్టు చెబుతున్నారు. ఆనాటి నుంచి దుర్గాదేవి ఆలయంలో పూజ జరిగే సమయంలో.. దౌల్లా కుటుంబ పూర్వికులు నగారా, ధాక్ మోగించేవారని.. క్రమంగా వీరు నగారా, ధాక్ వాయించడం ఆపేసినప్పటికీ.. దుర్గా ప్రసాదం ఇచ్చే సంప్రదాయం మాత్రం అలాగే కొనసాగుతూ వస్తోందని ఇక్కడి వారు తెలిపారు.. ఏది ఏమైనా మతసామరస్యానికి ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తోంది..








