Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ (Liquor Scam)లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha).. తీహార్ జైల్లో (Tihar Jail) ఉన్న విషయం తెలిసిందే.. కాగా తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టును కోరారు. ఈ మధ్యంతర బెయిల్పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరిగింది. హోరా హోరీగా సాగిన వాదనల్లో ఈడీ తరపు న్యాయవాది కోర్టులో కీలక వాదనలు చేశారు.

పది ఫోన్లలో డాటాను డిలీట్ చేసి తమకు సమర్పించారని కోర్టుకు తెలిపారు. వందల డిజిటల్ డివైజ్లను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఇన్ని చేసి కుమారుడికి పరీక్షలు ఉన్నాయని బెయిల్ కోరడం మానవతా కోణంలోకి రాదని వివరించారు.. అయినా ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయినట్లు గుర్తు చేశారు. అంతేకాకుండా కవిత చిన్నకొడుకు ఒంటరిగా ఏం లేడని, 22 ఏళ్ల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారని ఈడీ తరపు లాయర్ వాదనలు వినిపించారు.
ఆమె ముగ్గురు సిస్టర్స్ ఇప్పటికే కవితను ములాఖత్ అయ్యారని కోర్టుకు తెలిపారు. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని, బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్షాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు పేర్కొన్నారు. లిక్కర్ కేసు ప్లాన్ చేసింది కవితే అని తెలిపిన ఈడీ.. మొత్తం 10 ఫోన్లు ఆమె ఇచ్చారని, కానీ అవి ఫార్మాట్ చేసినవే అని నోటీసులు ఇచ్చిన తర్వాత మరో 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని వాదించారు. ఈ సందర్భంగా కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను ఈడీ తరపు న్యాయవాది జడ్జికి సమర్పించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. తీర్పును సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.








