Telugu News » Hyderabad : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ సీరియస్.. ముగ్గురికి లీగల్‌ నోటీసులు..!

Hyderabad : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ సీరియస్.. ముగ్గురికి లీగల్‌ నోటీసులు..!

చట్టం దృష్టిలో అందరూ ఒక్కటే అని తెలిపిన కొండా సురేఖ.. తప్పు చేసిన వారు ఎవరైనా సరే విచారణలో తేలితే శిక్షకు అర్హులేనని వ్యాఖ్యానించారు.

by Venu

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం మంట పెడుతుంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో కాంగ్రెస్ (Congress) నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ అంశంలో తీవ్రంగా స్పందించిన కేటీఆర్ (KTR).. తనపై చేసిన ఆరోణలకు ధీటుగా సమాధానం ఇవ్వడానికి సిద్దం అయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ లీగల్ యాక్షన్ లోకి దిగారు.

ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ (BRS) ముఖ్య నేతలున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు తనప్రమేయం లేకున్నా తన ప్రతిష్టకు భంగం కలించేలా వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు..

లేదంటే లీగల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపిన ఆయన పీవీ జనని అండ్ అసోసియేషన్ పేరుతో మార్చి 2వ తేదీతో లీగల్ నోటీసులు పంపించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై కోర్టుకు వెళ్తానంటూ నిన్న కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు.

చట్టం దృష్టిలో అందరూ ఒక్కటే అని తెలిపిన కొండా సురేఖ.. తప్పు చేసిన వారు ఎవరైనా సరే విచారణలో తేలితే శిక్షకు అర్హులేనని వ్యాఖ్యానించారు. ఈ మ్యాటర్ సీరియస్ గా తీసుకొన్న కేటీఆర్ పరువు నష్టం దావా వేయడం చర్చాంశనీయంగా మారింది. కాగా ఈ విషయంలో మంత్రి ఎలా రియాక్ట్ అవుతారో అనే ఉత్కంఠ నెలకొంది..

You may also like

Leave a Comment