Telugu News » Pawan Kalyan : అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్‌.. హైదరాబాద్ కు పయనం..!

Pawan Kalyan : అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్‌.. హైదరాబాద్ కు పయనం..!

పవన్ తెనాలి పర్యటన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని జనసేన నేతలు తెలిపారు. ఇక ఏపీలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పవన్.. బుధవారం సుమారు 20 కి.మీ వరకు ఎండలో పాదయాత్ర చేయడం వల్ల ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

by Venu
pawan-kalyan-janasena

ఏపీ (AP)లో ఎన్నికల వేడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా పార్టీలు ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో జనసేన (Janasena) అధినేత సైతం ప్రచార పర్వానికి తెర తీశారు. ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) డైలీ బిజీ బిజీగా ఉంటున్నారు. ఓ వైపు తాను పోటీ చేస్తోన్న పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు..

Pawan Kalyan: Janasenan ready to visit Pithapuram.. Everyone is excited..!మరోవైపు పార్టీ అధినేతగా జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతోన్న నియోజక వర్గాలలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు.ఇక తాజా సమాచారం ప్రకారం.. పవన్ కల్యాణ్, తెనాలి (Tenali) పర్యటన రద్దు అయ్యినట్లు తెలుస్తోంది. మరోవైపు నేటి సాయంత్రం తెనాలిలో నిర్వహించే జనసేన ర్యాలీ, సభల్లో పాల్గొనాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా పర్యటనను రద్దు చేసుకొన్నారు. జ్వరం పూర్తిగా తగ్గకపోవడంతో తెనాలి పర్యటనను రద్దు చేసుకొని హైదరాబాద్‌కు బయలు దేరినట్లు సమాచారం..

కాగా పవన్ తెనాలి పర్యటన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని జనసేన నేతలు తెలిపారు. ఇక ఏపీలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పవన్.. బుధవారం సుమారు 20 కి.మీ వరకు ఎండలో పాదయాత్ర చేయడం వల్ల ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి అధికార వైసీపీ ఓటమే లక్ష్యంగా బీజేపీ, జనసేన, టీడీపీ (TDP) ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లు దక్కాయి. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన పవన్ కల్యాణ్.. ప్రచార బాధ్యతల్ని సైతం నిర్వహిస్తున్నారు..

You may also like

Leave a Comment