సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే.. ఈ సినిమా స్టోరీ నా సొంతం అంటూ గతేడాది ఫిబ్రవరిలో శరత్ చంద్ర అలియాస్ ఆర్డీ విల్సన్ కేసు వేసిన సంగతి తెలిసిందే. స్వాతి దినపత్రికలో “సచ్చేంత ప్రేమ’ అనే కథనే తీసుకొచ్చి శ్రీమంతుడు సినిమా తెరకెక్కించారు అంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా ఆయన ఈ విషయమై మహేష్ బాబుకు చెందిన ఎంబి క్రియేషన్స్, డైరెక్టర్ కొరటాల శివ కు సమన్లు పంపాలి అంటూ శరత్ చంద్ర కోరారు.
అయితే.. ఈ కేసులో మహేష్ బాబుని ఆయన భార్య నమ్రత తెలివిగా తప్పించేసాడు. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ లో ఒకరైన ఎంబి క్రియేషన్స్ ఓనర్ పేరుని మహేష్ బాబు పేరు నుంచి గంగాధర్ అన్న వ్యక్తి పేరుపై మార్పించేసారు. దీనితో ఈ సినిమా నిర్మాత గంగాధర్ అన్న వ్యక్తి అని, మహేష్ బాబుకు ఈ సినిమా నిర్మాణ బాధ్యతలతో సంబంధం లేదు అని కోర్టులో మహేష్ బాబు తరపున లాయర్ వాదించారు.
అలాగే, ఈ కేసుకి అవసరమైన డాక్యూమెంట్స్ అన్నిటిని నమ్రత సిద్ధం చేయించి కోర్టుకి సబ్మిట్ చేసారు. కోర్టు కి కావాల్సింది సాక్ష్యాధారాలు మాత్రమే. ఆ సాక్ష్యాలను సబ్మిట్ చేయడంతో కోర్టు ఈ కేసుతో మహేష్ బాబు సంబంధం లేదు అని చెప్పి ఈ కేస్ నుంచి మహేష్ బాబుని తప్పించింది. అయితే.. కొరటాల శివ మాత్రం ఈ కేసులో ఇరుక్కున్నారు. ఇప్పటికే ఆయన విచారణకు హాజరు అయ్యారు. అయితే కోర్టు మాత్రం రచయిత శరత్ చంద్రకు అనుకూలంగా తీర్పుని ఇచ్చారు.





















యూవీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ.200కోట్లతో బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా, ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ త్రిష హీరోయిన్గా నటిస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
దీనికి సంబంధించి ఇటీవల ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జిమ్ వీడియో వైరల్గా మారింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
