Telugu News » సినిమాల్లో కాళ్ళు మొక్కే సీన్స్ కి ఒకే చెప్పిన హీరోస్.. వీళ్ళు ఎంతో మందికి ఇన్స్పిరేషన్!

సినిమాల్లో కాళ్ళు మొక్కే సీన్స్ కి ఒకే చెప్పిన హీరోస్.. వీళ్ళు ఎంతో మందికి ఇన్స్పిరేషన్!

కాళ్ళు పట్టుకునే సీన్స్ కి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా నటించిన హీరోలు వీళ్ళే!

by Sri Lakshmi

సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఒక స్థాయికి వచ్చేసిన తరువాత తాము సినిమాలు ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే.. తాము ఎంచుకునే సినిమాలలో తమ స్థాయి తక్కువ కాకుండా ఉండేలా చూసుకుంటారు. ఈ హోదా కారణంగానే వారు తాము ఎంచుకునే సినిమాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటె.. వాటిని చెప్పి తమకు తగ్గట్లు మార్పించుకుంటూ ఉంటారు. కానీ, కొన్నిసార్లు దీనివల్ల కథలో డెప్త్ దెబ్బతింటుంది. కానీ, కొందరు హీరోలు తమ స్థాయి, హోదాలను పక్కన పెట్టి కథకు వేల్యూ ఇచ్చి ఏ సన్నివేశంలో అయినా నటిస్తూ ఉంటారు.

అలా.. టాలీవుడ్ లో కొందరు హీరోలు తమకు వచ్చిన సన్నివేశాలలో అభ్యంతరాలు చెప్పకుండా నటించే వారు ఉన్నారు. కాళ్ళు పట్టుకునే సన్నివేశం వచ్చినా.. ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా నటించే హీరోలు ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. నారప్ప సినిమాలో హీరోగా వెంకటేష్ నటించారు. ఈ సినిమాలో నారప్పగా వెంకటేష్ ఊరి ప్రజల ముందు కాళ్ళు పట్టుకోవాల్సిన సన్నివేశం ఒకటి ఉంటుంది. ఈ సన్నివేశంలో వెంకటేష్ ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా నటించారట.

అలాగే ప్రభాస్ కూడా సాలార్ సినిమాలో తన ఫ్రెండ్ కోసం నారంగి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ ఆ షూట్ ని డూప్ పక్కనే ఉండి చేస్తానని అడిగినా.. ప్రభాస్ పర్లేదు.. నేనే చేస్తాను అని చెప్పి చేశారట. అలాగే సూపర్ స్టార్ రజిని కాంత్ కూడా జైలర్ సినిమాలో ఇలాంటి సన్నివేశమే ఒకటి చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో రజిని కొడుకు షూ పోలిష్ చేయాల్సి వస్తుంది. కానీ, రజిని ఈ సన్నివేశానికి ఎటువంటి అబ్ జెక్షన్ పెట్టకుండా నటించారట.

You may also like

Leave a Comment