టర్కీ (Turkey) రాజధాని ఇస్తాంబుల్ (Istanbul) నగరంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Hazard)చోటు చేసుకొంది. పునర్నిర్మాణంలో ఉన్న మాస్వ్కెరేడ్ నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదం జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి.. నేడు పదహారు అంతస్థుల బిల్డింగ్ లో గ్రౌండ్, బేస్మెంట్ ఫ్లోర్లలో మంటలు చెలరేగినట్లు తెలిపారు.. బిల్డింగ్ రికస్టక్చషన్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ భారీ అగ్ని ప్రమాదంలో 26 మంది చనిపోయినట్లు (26 Dead) ఒక వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా సమాచారం అందుకొన్న ఫైర్ ఇంజన్ సిబ్బంది.. సంఘటన ప్రదేశానికి చేరుకొని మంటలను అర్పివేసినట్లు అధికారులు తెలిపారు.. ఈ ఘటనలో క్లబ్ (Club) యజమానితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు ఇస్తాంబుల్ గవర్నర్ దావత్ గుల్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు మంటలు వ్యాపించడానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో అన్ని దేశాలలో అగ్నిప్రమాదాలు తరచుగా సంభవించడం జరుగుతుంది. ఒక్కోసారి ప్రాణ నష్టంతో పాటుగా ఆస్తి నష్టాలు తీవ్రంగా చోటు చేసుకోవడం కనిపిస్తుంది.