రోడ్డు ప్రమాదాలు జరగని రోజు లేదు.. దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకొంటున్నాయి.. కాగా తాజాగా మరో దారుణమైన ఆక్సిడెంట్ జరిగింది. అతివేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీ కొట్టడంతో స్పాట్ లోనే ఆరుగురు మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లోని ఉన్నవ్ (Unnav) ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. నేటి మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను గమనించిన సమీప గ్రామస్థులు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు.. అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు ప్రమాదం జరిగిన స్థలానికి హుటాహుటిన చేరుకొన్నారు..
కాగా ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో.. అప్పటికే ఆరుగురు మృతి చెందారని.. మరో 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మరోవైపు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు ముప్పై మంది వరకు ఉన్నట్లు వెల్లడించారు..
మరోవైపు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం, దేవాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కారు ను లారీ ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ (45) మృతి చెందారు. కాగా తాడ్వాయి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆయన డ్యూటీ నిమిత్తం కామారెడ్డి (Kamareddy) నుంచి తాడ్వాయి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.