భూ సంబంధిత మనీలాండరింగ్ కేసు(Money Laundering)లో జనవరి 31న అరెస్టైన ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Jharkhand Ex CM Hemant Soren)ను మరో మూడు రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది.
ఈ కేసులో మాజీ సీఎం సహాయకుడు భాను ప్రతాప్ ప్రసాద్, రెవెన్యూ సబ్ ఇన్స్పెక్టర్ ప్రాంగణంలో 17 ఒరిజినల్ రిజిస్టర్లతో పాటు 11ట్రంక్ల నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రాంచీ జిల్లాలోని బర్గె సర్కిల్లో అక్రమంగా ఆక్రమించిన 8.5 ఎకరాల స్థలంలో సోరెన్ బాంకెట్ హాల్ నిర్మించాలనుకున్నట్లు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఆయన కస్టడీ ముగియగా సోరెన్‌ను మరో నాలుగు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది. అయితే, మరోవైపు తన అరెస్టును సవాల్ చేస్తూ ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ నెల 27న ఈ పిటిషన్‌పై తుది విచారణ చేపడతామని వెల్లడించారు. ఆలోపు ఏకీకృత అఫిడవిట్’ను దాఖలు చేయాలని ఈడీని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.