బీజేపీ (BJP)పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) చీఫ్, ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. తనను పార్టీలో చేరాలని బలవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. వారు ఎన్ని జిమ్మిక్కులు చేసిన కాషాయ పార్టీకి ఎన్నటికీ లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నేడు ఢిల్లీలో రెండు పాఠశాలల భవనాలకు శంకుస్థాపన చేసిన అనంతరం కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా.. ఒత్తిడి పెంచినా వాటిని ధీటుగా ఎదుర్కొంటానని తెలిపారు. బీజేపీ నేతృత్వంలో, కేంద్ర ప్రభుత్వం జాతీయ బడ్జెట్లో 4 శాతం మాత్రమే ఖర్చు చేస్తుందని ఆరోపించిన కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రభుత్వం ప్రతి ఏటా తన బడ్జెట్లో 40 శాతాన్ని పాఠశాలలు, ఆస్పత్రుల కోసం ఖర్చు పెడుతోందని వివరించారు. తనను జైలుకు పంపినా పాఠశాలల నిర్మాణం, ప్రజలకు ఉచిత వైద్యం వంటి అభివృద్ధి పనులు ఆగవని స్పష్టం చేశారు.
కేంద్రం తమపై కక్ష కట్టిందని విమర్శించారు.. స్కూళ్లు కట్టినందుకే మనీశ్ సిసోడియాను, మొహల్లా క్లినిక్‌లు నిర్మించినందుకే సత్యేందర్ జైన్లను జైలుకు పంపారని ఆరోపణలు చేసిన ఢిల్లీ సీఎం.. తనను కూడా అరెస్ట్ చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని తెలిపారు.. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 5 సార్లు ఈడీ పంపిన సమన్లను కేజ్రీవాల్ దాటవేశారు. దీంతో ఢిల్లీ రోస్ ఎవెన్యూ కోర్టుకు వెళ్లింది ఈడీ. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కి రానున్న రోజుల్లో మరిన్ని చిక్కులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఢిల్లీ మంత్రి అతిశీకి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన విషయంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నేడు నోటీసులు జారీ చేశారు. ఉదయం అతిశీ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమె లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి ఇచ్చారు. 24గంటల్లోగా దీనిపై స్పందించాలని ఆదేశించారు. కాగా ఈ అంశంపై స్పందించిన అతిశీ.. పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈసారి బీజేపీ ఆపరేషన్ కమలం 2.0ని ప్రారంభించిందని విమర్శించారు.




ఇక, సౌత్ కరోలినా (South Carolina) ప్రైమరీలో విజయం సాధించిన సమయంలో బైడెన్ లాస్ ఏంజెల్స్‌లో నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఉండగా, పోటస్ జో బిడెన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు USA అధ్యక్షుడిగా రెండోసారి గెలవాలని తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

దీంతో చాలా మంది ప్రజల ఆచూకీ సైతం గల్లంతైనట్లు తెలుస్తోంది. భారీ మంటలకు తోడు దట్టమైన పొగ కమ్ముకోవడం వల్ల, మంటలను అదుపు చేయడంలో ఆలస్యం అవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.. దీంతో భారీగా ఎగిసిపడుతున్న మంటలు అటవీ ప్రాంతం మొత్తం పాకుతున్నాయని, ఇప్పటికే ఈ ప్రమాదంలో 106,000 ఎకరాల అడవి కాలిపోయిందని వారు తెలిపారు.


