ప్రస్తుతం రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల గాలి వీస్తూంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫలానా పార్టీకి బీ టీం మీది అని ఒక నేత అంటే కాదు మీదే ఆ పార్టీకి బీ టీం అంటూ మరొకరు విమర్శలు చేసుకోవడం కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికలలో విమర్శలు, ఆరోపణలు కామన్.. కానీ తాజా ఎన్నికలలో అప్ డేట్ అయిన నాయకులు ప్రత్యర్థి పార్టీల మీద ఒక రేంజ్ లో విరుచుకుపడటం కనిపిస్తోంది.
మరోవైపు తెలంగాణలో ముక్కోణపు పోటీ లేకున్నా.. మూడు పార్టీల నేతల మధ్య నిప్పుల వర్షం కూరుస్తుందా అనేలా పోరు సాగుతోంది. ఎవరు ఎవరిని ఎప్పుడు.. ఏ స్థాయిలో విమర్శిస్తారో అనే ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో నిజామాబాద్ (Nizamabad), బీజేపీ (BJP) ఎంపీ అర్వింద్ (Arvind).. సీఎం రేవంత్ రెడ్డిపై కీలకవ్యాఖ్యలు చేశారు. ఒక హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలా ఆయన మాట్లాడేటివి అని మండిపడ్డారు..
ఇకనైనా తాను ఒక రాష్ట్రానికి సీఎం అని గమనించుకొని హుందాగా వ్యవహరించాలని సూచించారు. హోంమంత్రి వీడియోలు మార్ఫ్ చేస్తే ఊరుకుంటారా అని అర్వింద్ ప్రశ్నించారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో నోటీసులు రాగానే రేవంత్ రెడ్డి మాయం అయ్యారని ఎద్దేవా చేశారు.. గతంలో మోడీ (Modi)ని బడే భాయ్ అన్నందుకు రాహుల్ గాంధీ, రేవంత్‌పై కక్షకట్టారని ఆరోపించారు..
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారే కక్ష కట్టారని వెల్లడించిన ఎంపీ.. సీఎంని జైలుకు పంపాలని ఆయన చుట్టుపక్కన ఉన్న వాళ్లే చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ (Congress) నిజ స్వరూపం బయట పడుతుందని అర్వింద్ జోస్యం చెప్పారు..