Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
పదిమెట్లు ఎక్కాలంటే ఒక్క అడుగుతోనే ప్రారంభించాలి అన్న విషయం తెలిసిందే. అలాగే ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వెళ్ళిన కాంగ్రెస్ (Congress).. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా గెలుపు సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వతా రాబోయే లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించి.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచారాస్త్రాలపై దృష్టి సారించాయి.
ఎవరికి వారే మెజారిటీ స్థానాలపై ఆశలు పెంచుకొన్నారు.. ఈ నేపథ్యంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయనే దానిపై పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ సంస్థలు తెలంగాణ (Telangana)లో సంయుక్తంగా నిర్వహించిన ట్రాకర్ పోల్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ (Congress) పార్టీ ఏకంగా 8 నుంచి పది పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకొని అగ్రస్థానంలో నిలవబోతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది.
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ (BRS) 3 నుంచి 5 స్థానాలకే పరిమితం కాబోతున్నదని నిరాశపరిచింది. ఇక బీజేపీ (BJP) 2 నుంచి 4 సీట్లు, ఇతరులు ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈమేరకు తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై ఫిబ్రవరి 11 నుంచి 17 వరకు ట్రాకర్ పోల్ సర్వేను నిర్వహించారు. ఈ సర్వే కోసం ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో 4,600 శాంపిల్స్ సేకరించారు.
మరోవైపు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 శాతం, బీఆర్ఎస్ కు 31 శాతం, బీజేపీకి 23 శాతం, ఇతరులు 6 శాతం ఓట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ 1 శాతం, బీజేపీ 9 శాతం ఓట్లు అధికంగా కైవసం చేసుకుంటుండగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మాత్రం 6 శాతం ఓట్లను కోల్పోబోతున్నదని ఈ సర్వే తేల్చింది.
ఇదిలా ఉండగా ప్రధానిగా ఎవరనే దానిపై నిర్వహించిన సర్వేలో 34 శాతం మంది మోడీకే జైకొట్టినట్లు పేర్కొంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 23 శాతం, ప్రియాంక గాంధీకి 11 శాతం, మమతాబెనర్జీకి 10 శాతం, అరవింద్ కేజ్రీవాల్ కు 7 శాతం, ఇతరులను 14 శాతం ఎంచుకున్నట్లు సర్వేలో తెలిపింది. అలాగే అధికార పార్టీ అనే ట్యాగ్ లైన్ కాంగ్రెస్ కు, మోడీ ఆధరణ బీజేపీకి కలిసి రానున్నట్లు పేర్కొంది.






