Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) పర్వం స్వల్ప ఉద్రిక్తతల నడుమ ముగిసింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఇక ఫలితాలపైనే అందరి దృష్టి ఉంది. ఎన్నికలకు ముందు పటిష్టంగా తనిఖీలు చేపట్టిన పోలీస్ శాఖ ఇప్పుడు రిలాక్స్ అయిపోయింది. ఇదే అదనుగా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. రోడ్డు వెంట సోదాలు ముగియడంతో గంజాయి(Ganja) రవాణా జోరందుకుంది.
తాజాగా, రోడ్డు ప్రమాదంలో ఓకారు బోల్తా పడడంతో పెద్దమొత్తంలో గంజాయి బయటపడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని జహీరాబాద్ మండలం బూజ్నేల్లి సమీపంలో శనివారం తెల్లవారుజామున ఓ కారు బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కారులో పెద్దమొత్తంలో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో క్వింటాలుకుపైగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత అందులో వచ్చిన వ్యక్తులు కారును అక్కడే వదిలి పరారైనట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.50లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు.
కారు నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చుట్టుపక్క ప్రాంతాల్లో స్మగ్లర్ల కోసం గాలిస్తున్నామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కర్ణాటక సరిహద్దుల్లో ప్రమాదం జరగడంతో దానిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే విషయంపై స్పష్టత రావాల్సిఉందని చెప్పారు. అయితే గంజాయిని ఒడిశా నుంచి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
అధికార పీఠం అరచేతిలోకి రావడానికి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. ప్రధాన పార్టీలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. కాగా ఓటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నట్లు ఎన్నికల అధికారి (Election Officer) వికాస్ రాజ్ (Vikas Raj)తెలిపారు. రేపు ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని తెలిపిన ఎన్నికల అధికారి.. సాయంత్రం 5గంటలకు ఫలితాలను వెల్లడిస్తామన్నారు..



అయితే ఇప్పటి వరకు అధికారం తమదే అనే ధీమాలో బీఆర్ఎస్ (BRS) ఉన్నదన్న విషయం తెలిసిందే. ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న గులాభి బాస్ కు.. తాను చేసిన రాజశ్యామల యాగం ఏమేరకు ప్రభావం చూపిస్తుందో అని అనుకుంటున్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో (southern states) వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి (CM) అయిన చరిత్ర ఉందా? అని గమనిస్తే.. అలాంటి చరిత్ర ఇప్పుడు మొదలైతేనే తెలంగాణ రాజకీయం కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుందని అంటున్నారు.
