Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మంగళవారం యూరోపు దేశాల పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన న్యాయవాదులు, విద్యార్థులు, భారతీయ మూలాలుగల ప్రజలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఓ వైపు జీ20(G20 Summit) సదస్సు అంగరంగ వైభవంగా జరుగుతున్న సమయంలో ఆయన విదేశాలకు వెళ్లారు.
తిరిగి ఆయన ఈ సదస్సు ముగిసిన మర్నాడు స్వదేశానికి వస్తారు. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వివరాలను వెల్లడించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, రాహుల్ గురువారం బ్రసెల్స్‌లో యూరోపియన్ యూనియన్ న్యాయవాదులతో సమావేశమవుతారు.
అదేవిధంగా ది హేగ్‌లో కూడా ఆయన న్యాయవాదులతో సమావేశమవుతారు. ఆయన శుక్రవారం పారిస్ నగరంలో ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతారు.
ఆయన ఈ నెల 9న పారిస్‌లో ఫ్రాన్స్ లేబర్ యూనియన్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఆయన నార్వేకు వెళ్తారు. ఈ నెల 10న ఓస్లో నగరంలో భారతీయ మూలాలుగలవారితో సమావేశమవుతారు. ఈ నెల 11 తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది.
జీ20 సదస్సు న్యూఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరుగుతుంది. దాదాపు 30 దేశాలకు చెందిన అగ్ర నేతలు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ ఏడాది ఈ సదస్సుకు భారత దేశం అధ్యక్షత వహిస్తోంది.
