Telugu News » UdayaNidhiStalin: ఉదయనిధి తల తెచ్చిన వారికి కోటి రూపాయలిస్తాను: తెలంగాణ బీజేపీ నేత!

UdayaNidhiStalin: ఉదయనిధి తల తెచ్చిన వారికి కోటి రూపాయలిస్తాను: తెలంగాణ బీజేపీ నేత!

హిందువులంతా ఇప్పటికైనా ఏకతాటిపైకి వచ్చి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

by Sai
will give 1 crore whoever removes udayanidhi says bjp leader dileepachari

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(Stalin) కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే చాలా మంది రాజకీయ ప్రతినిధులు ఉదయ నిధి మీద ఆగ్రహంగా ఉన్నారు. హిందూ సంఘాలు ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నాయి.

will give 1 crore whoever removes udayanidhi says bjp leader dileepachari

ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలోని నాగర్ కర్నూల్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జీ(BJP Incharge) దిలీపాచారి మాట్లాడుతూ… ఉదయనిధి దేశద్రోహి అని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న ఉదయనిధిని నిర్మూలించిన వారికి కోటి రూపాయల నజరానా ఇస్తానని ప్రకటించారు. సామాజిక న్యాయానికి, సమానత్వానికి సనాతన ధర్మం ప్రతీక అని చెప్పారు.

దేశ ప్రజల మధ్య ఐకమత్యం కోసం బీజేపీ తాపత్రయ పడుతోందని… ద్రావిడం, సంస్కృతం అంటూ ప్రజల మధ్య విభేదాలను సృష్టించి, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఉదయనిధి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. హిందువులంతా ఇప్పటికైనా ఏకతాటిపైకి వచ్చి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేవారిని క్షమించకూడదని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే అయోధ్య సాధువు జగద్గురు పరమహంస ఆచార్య సంచలన ప్రకటన చేశారు. ఉదయనిధి స్టాలిన్‌ తల నరికిన వారికి ఏకంగా 10 కోట్ల రూపాయలు ఇస్తానని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. కత్తితో ఉదయనిధి స్టాలిన్‌ ఫొటోను పొడిచి ‘‘నేను పదికోట్ల నజరానా ప్రకటిస్తున్నారు. ఎవరైతే.. డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ తల తెచ్చి ఇస్తారో వారికి ఆ డబ్బులు ఇస్తాను. ఎవ్వరూ ఆ తల తేలేకపోతే.. నేనే స్వయంగా అతడి తల నరుకుతాను’’ అని అన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది సాధువు సపోర్టు చేస్తుంటే.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కాగా, ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రామ్‌ చరణ్‌ పా ట్వీట్‌ ఒకటి వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌లో ఆయన ‘సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం’ అని రాసుకొచ్చారు. తన తల్లి సురేఖ తులసి కోటకు పూజ చేస్తున్న ఫొటోను జత చేశారు.

You may also like

Leave a Comment