Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ (brs) ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలేదనే కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ముట్టడించాలని బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చాయి.
ఈ క్రమంలోనే మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడలోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(sabitha indra reddy) క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శుక్రవారం ఉదయాన్నే భారీ సంఖ్యలో బీజేపీ(bjp) నేతలు క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోవడంతో బీఆర్ఎస్ నేతలు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో మీర్పేట్ సీఐ కిరన్ కుమార్ కింద పడడంతో స్వల్పంగా గాయాలయ్యాయి.
ఆందోళన చేపట్టిన కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్ కు తరలించారు.ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం ఆపేది లేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
గురువారం కూడా వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, సిరిసిల్ల లో కేటీఆర్ క్యాంపు ఆఫీస్ ను కూడా బీజేపీ కార్యకర్తలు చుట్టిముట్టారు.