Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
తనది కాంగ్రెస్ రక్తమని, టికెట్ ఇవ్వకుంటే తానేం తిరుగుబాటు చేయనని కాంగ్రెస్ సీనియర్ నేత (Congress Senior Leader) వి. హనుమంతరావు (V. Hanumantharao)అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తన మద్దతు ఇవ్వడం కొందరికి నచ్చడంలేదన్నారు.
రేవంత్ పనిచేస్తున్నారు కాబట్టే తన మద్దతు తెలుపుతున్నానని స్పష్టం చేశారు. ఖమ్మం (Khammam) ఎంపీ టికెట్ (MP Ticket) కోసం కాంగ్రెస్ హై కమాండ్ను అడిగానని చెప్పారు. ఒకేవేళ తనకు టికెట్ ఇవ్వకపోయినా తానేం తిరుగుబాటు చేయనంటూ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ హైకమాండ్ టికెట్ ఇస్తే కచ్చితంగా తన కోసం పని చేస్తామని అంటున్నారని చెప్పారు.
సోషల్ ఇంజనీరింగ్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయకుండా చూసుకోవాలని వి.హనుమంతరావు సూచించారు. 2019లోనే తాను ఖమ్మం నుంచి పోటీ చేయాలని ప్రయత్నం చేశానని గుర్తు చేశారు. అయితే రాజీవ్ గాంధీ ఆలోచన మేరకు ఖమ్మం నుంచి పోటీ చేయాలనుకున్నానని చెప్పారు.
ఖమ్మం నుంచి పోటీ చేయడానికి అక్కడ గ్రౌండ్ వర్క్ చేశానంటూ చెప్పుకొచ్చారు వీహెచ్. తనకు టికెట్ ఇస్తే అక్కడ తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనను ఖమ్మంలో పోటీ చేయమని చెప్పి, ఇప్పుడు ఆయన భార్యకు టిక్కెట్ కావాలని అడుగుతున్నారని ఆరోపించారు.