Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
బీఆర్ఎస్(BRS) పార్టీపై సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Sambasivarao) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ(Communist Party of India) శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్లో బీఆర్ఎస్ పార్టీ మూసివేయడం తథ్యమన్నారు.
అహంకారంతో విర్రవీగిన బీఆర్ఎస్ పార్టీలో నేడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేక మదనపడుతున్న పరిస్థితుల్లో ఉందని కూనంనేని ఎద్దేవా చేశారు. అనవసరంగా సెక్రెటేరియట్ను కూల్చి మళ్లీ నిర్మించిదని ఆయన బీఆర్ఎస్పై మండ్డిపడ్డారు.
అయితే, బీఆర్ఎస్ ఇలాగే ఇష్టానుసారంగా వ్యవహరించి అనేక నిర్మాణాల్లో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అప్పుడు కేసీఆర్ రాజులా, కేటీఆర్ యువరాజులా నేలమీద నిలబడలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు గెలవడమే కష్టమని అన్నారు.
మరోవైపు ఎంత వేగంగా టీఆర్ఎస్ భవనం నిర్మించారో.. అంతే వేగంగా బీఆర్ఎస్ భవనం పేక మేడలా కూలిపోవడానికి సిద్ధంగా ఉందని సాంబశివరావు సెటైర్లు వేశారు.