యాదాద్రి (Yadadri) జిల్లా భూధాన్ పోచంపల్లి (Bhudhan Pochampalli) జలాల్ పురం ( Jalal Puram) గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతితో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం.. బుధవారం చోటు చేసుకొన్న సంఘట వివరాలు చూస్తే.. జలాల్పురం గ్రామానికి చెందిన మృతుడు కేసారం ప్రశాంత్ (20), తండ్రి పాపయ్యతో పాటు తన నానమ్మను హాస్పిటల్లో చూపించడానికి బ్రీజా కార్‌ను సెల్ఫ్ డ్రైవింగ్‌తో అద్దెకు తీసుకున్నాడు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి కారుని తీసుకొని తన స్నేహితులైన నర్ర శివ (20) సోదరుడు శ్రీకాంత్ వారి తండ్రి నరసింహ, నర్ర రాఘవేంద్ర (18) అతని తండ్రి వెంకటేష్, శాపాక నవదీప్(18) వీరంతా బ్రీజా కార్లో పోచంపల్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు.. ప్రశాంత్ కారు డ్రైవింగ్ చేస్తోన్నట్టు సమాచారం.. ఈ క్రమంలో విద్యుత్ సబ్‌స్టేషన్ మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి పక్కన ఉన్న వెంచర్లోకి దూసుకెళ్లి ఎదురుగానున్న రెండు విద్యుత్ స్తంభాలను బలంగా ఢీకొట్టడంతో ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం..
ప్రమాదం విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు తెలిపారు. మృతి చెందిన ప్రశాంత్‌ను శవపరీక్ష నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. స్థానిక ఎస్సై విక్రమ్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు..

ఫినాలే రోజు సెలెబ్రిటీల (Celebrities) అద్దాలు ధ్వంసం చేయడం.. ఆర్టీసీ బస్సు (Rtc Bus) అద్దాలు ధ్వంసం చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జునను కూడా అరెస్ట్ చేయాలని కూడా హైకోర్టులో (High Court) పిటిషన్ దాఖలైంది. బిగ్‌బాస్ పేరుతో 100 రోజులు అక్రమంగా కొందరిని నిర్బంధిస్తున్నారని.. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకొని నాగార్జునను అరెస్ట్ (Arrest) చేయాలంటూ అడ్వొకేట్ అరుణ్ (Arun) పిటిషన్ వేశారు.

