తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Elections) తుది అంకానికి చేరుకున్నాయి. ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థుల అనుచరులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. చాలా చోట్ల డబ్బు, మద్యం పెద్దఎత్తున పట్టుబడుతూనే ఉన్నాయి. అయితే, ఈ ప్రలోభాల పర్వంలో కొందరు అధికారులు కూడా పాల్గొనడం చర్చగా మారింది.
మేడ్చల్ జిల్లా(Medchal Dist) మేడిపల్లి(Medipally)లో డబ్బులు పంచుతూ దొరికిపోయిన వరంగల్ ఎక్సైజ్ అధికారి(Warangal Excise Officer) అంజిత్ రావు(Anjith Rao) ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. మంగళవారం చెంగిచర్ల క్రాస్ రోడ్ దగ్గర కారులో పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది.
బీఆర్ఎస్ నేతలు కారులో డబ్బులు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో కాంగ్రెస్ నాయకులు కారును అడ్డుకున్నారు. భారీగా 500, 200 నోట్ల కట్టలు ఉన్న బ్యాగులు గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తి గురించి ఆరా తీయగా సీఐ అంజిత్ రావు పేరుతో ఉన్న ఐడీ కార్డు లభ్యమైంది.
పోలీసు అయి ఉండి అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున డబ్బులు పంచుతున్నారన్న కోపంతో కాంగ్రెస్ నేతలు అంజిత్రావును నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారులు వెంటనే డబ్బును, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ అధికారి అంజిత్ రావును సస్పెండ్ చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.




ఒకరకంగా ఈ రెండు నియోజక వర్గాల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయని తెలుస్తుంది. ఇక కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీకి దిగిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పోటీపై క్లారిటీ ఇచ్చారు.. కామారెడ్డి భూములను కంచె వేసి కాపాడేందుకే తాను ఇక్కడి నుంచి పోటీకి దిగినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కామారెడ్డి భూముల కబ్జా చేయడానికి వచ్చాడని ఆరోపించిన రేవంత్.. పొరపాటున గెలిపించారో భూములన్నీ పోతాయని హెచ్చరించారు.