బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ (Congress).. ఆ దిశగా వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే హస్తం పన్నిన చక్ర వ్యూహాన్ని చేధించలేక బీఆర్ నేతలు.. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలకు దిగినట్టు.. ఓటర్లను భయాందోళనకు గురిచేసే విధంగా ప్రచారం చేస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి..
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వివిధ వర్గాలను ఆకట్టుకునేలా హామీల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా మరో 66 అశాలతో కూడిన మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్.. మరో కీలక హామీ ఇవ్వడానికి సిద్దం అయ్యింది. ఈ క్రమంలో టీపీసీసీ (TPCC) చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth-Reddy) మరో కీలక హామీ ప్రకటించారు.
గత కొంత కాలంగా సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు.. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంలో రేవంత్ ఎక్స్ (Twitter) వేదికగా రియాక్ట్ అయ్యారు. విద్యాశాఖలో పని చేస్తోన్న తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులు (SSA) నెల రోజుల పాటు వారి న్యాయమైన హక్కుల కోసం ఆందోళన చేసిన విషయం నా దృష్టిలో ఉందన్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..