Telugu News » Traffic Inspector: పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం.. మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌…!

Traffic Inspector: పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం.. మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌…!

మహంకాళి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌(Traffic Inspector) మానవత్వం (Humanity) చాటుకున్నారు. పరీక్షలు రాసేందుకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదానికి(Road accident) గురైన ఇంటర్ విద్యార్థిని(inter student)కి ప్రథమ చికిత్స(first aid) చేశారు. అనంతరం తన వాహనంలోనే పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు.

by Mano
Traffic Inspector: Accident while going to write the exam.. Traffic Inspector who showed humanity...!

అయితే, ఇంటర్ పరీక్ష రాసేందుకు ఇవాళ (మార్చి 1) ఓ విద్యార్థి పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో విద్యార్థినికి గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న మహంకాళి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఉపాశంకర్‌ ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు.. ఓ విద్యార్థిని తన తండ్రితోపాటు ద్విచక్ర వాహనంపై పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా.. సికింద్రాబాద్ ఎంజీ రహదారి తపస్య కళాశాల వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు కింద పడిపోయారు. దీంతో ఆ విద్యార్థిని తలకు గాయాలయ్యాయి. అక్కడే విధులు నిర్వహిస్తోన్న మహంకాళి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఉపాశంకర్.. ఇది గమనించి వెంటనే తన వాహనంలో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి.. చికిత్స చేయించారు.

ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు పరీక్షా కేంద్రంలోని ప్రిన్సిపల్ అనుమతి తీసుకుని.. ఆమెను ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని తలకు ఏడు కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత విద్యార్థిని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చి వదిలిపెట్టారు. అనంతరం ఆ విద్యార్థిని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఉపాశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

You may also like

Leave a Comment