Telugu News » Hyderabad : నగరంలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు..ఈ మార్గాలలో రావద్దంటున్న అధికారులు..!!

Hyderabad : నగరంలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు..ఈ మార్గాలలో రావద్దంటున్న అధికారులు..!!

రాష్ట్రపతి కాన్వాయ్​ వెళ్లే మార్గంలో ఇరువైపులా ఉన్న నివాసాలపై పోలీసులు, ఇంటెలిజెన్స్​ సిబ్బంది ఇప్పటికే పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు. అదీగాక రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు (Traffic Restrictions)లో ఉంటాయని అధికారులు తెలుపుచున్నారు.

by Venu

ప్రతి శీతాకాలంలో భారత రాష్ట్రపతి హైదరాబాద్ (Hyderabad)లోని​ బొల్లారం రాష్ట్రపతి నిలయానికి విడిది చేయడానికి వస్తుంటారు. ఈ క్రమంలోనే నేడు హైదరాబాద్​కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) రానున్నారు. ఈ నేపథ్యంలో నగరం​లో పలు చోట్ల ట్రాఫిక్​ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రపతి నిలయం సందర్శనను సైతం రద్దు చేశారు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి సాయంత్రం ప్రత్యేక విమానంలో.. హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బొల్లారం (Bollaram) రాష్ట్రపతి నిలయంకి చేరుకొనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా బొల్లారం నిలయానికి వెళ్లే మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్​కు సంబంధించి అధికారులు రిహార్సల్ కూడా చేశారు. ఈ ఏర్పాట్లు మొత్తాన్ని సైబరాబాద్​ సీపీ ఏకే మహంతి (Cyberabad CP AK Mohanthy) పర్యవేక్షించారు.

మరోవైపు రాష్ట్రపతి కాన్వాయ్​ వెళ్లే మార్గంలో ఇరువైపులా ఉన్న నివాసాలపై పోలీసులు, ఇంటెలిజెన్స్​ సిబ్బంది ఇప్పటికే పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు. అదీగాక రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు (Traffic Restrictions)లో ఉంటాయని అధికారులు తెలుపుచున్నారు. ఈమేరకు నేటి సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్​, బొల్లారం జంక్షన్​, నేవీ జంక్షన్​, యాప్రాల్​ రోడ్​, బైసన్​ గేట్​, లోతుకుంట జంక్షన్​ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.

You may also like

Leave a Comment