Telugu News » Train Accident: ‘రైల్వే శాఖ నిద్ర లేవదా..?’ రైలు ప్రమాదంపై ప్రతిపక్షాల నిలదీత..!

Train Accident: ‘రైల్వే శాఖ నిద్ర లేవదా..?’ రైలు ప్రమాదంపై ప్రతిపక్షాల నిలదీత..!

ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ట్రాక్‌పై ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొంది. మూడు బోగీలు నుజ్జునుజ్జు కావడంతో సహాయ చర్యలు అందించడం సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు రైల్వే శాఖపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

by Mano
Train Accident: 'Isn't the railway department awake?'

విజయనగరం జిల్లా(Vijayanagaram Dist)లో ఆదివారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదం(Train Accident)లో ఇప్పటి వరకు 14మంది దుర్మరణం చెందారు. సుమారు 30మంది గాయాలపాలయ్యారు. కొత్తవలస(Kothavalasa) మండలం కంటకాపల్లి-అలమండ(Kantakapalli-Alamanda) మధ్య ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ట్రాక్‌పై ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొంది. మూడు బోగీలు నుజ్జునుజ్జు కావడంతో సహాయ చర్యలు అందించడం సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు రైల్వే శాఖపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి.Train Accident: 'Isn't the railway department awake?'

ఈ రైలు ప్రమాదంలో ప్రతిపక్షాలు ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించాయి. రైలు ప్రమాదం తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ‘రైలు పట్టాలు తప్పడం.. రైళ్లు ఢీకొనడం.. ప్రయాణికులు నిస్సహాయ స్థితిలోకి వెళ్లడం.. ఇలాంటి పరిస్థితులు పదేపదే వస్తూనే ఉన్నాయి. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపాలి.. సత్వర సహాయ చర్యలు చేపట్టాలి.. తక్షణ దర్యాప్తు జరగాలి.. రైల్వే శాఖ నిద్రమత్తు నుంచి ఎప్పుడు బయటపడుతుంది..?’ అంటూ మమతాబెనర్జీ ప్రశ్నించారు.

Train Accident: 'Isn't the railway department awake?'

అదేవిధంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాదం చాలా బాధాకరం.. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.. దేశంలో ఇలాంటి రైలు ప్రమాదాలు పదేపదే జరగడం ఆందోళన కలిగిస్తోంది. రైలు భద్రతా చర్యలను కేంద్రం, రైల్వే వెంటనే పునఃపరిశీలించాలి’ అని పేర్కొన్నారు.

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. ‘2023 జూన్‌లో బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన కొద్ది నెలలకే.. ఏపీలోని ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకోవడం నన్ను కలచివేసింది. దీంతో నేను తీవ్ర మనోవేదనకు గురయ్యాను. నా ఆలోచనలన్నీ బాధిత కుటుంబాలపైనే ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.’ అని పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో రైల్వే అధికారులు స్పందిస్తూ.. విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైలు వెనుక నుంచి రెండు కోచ్‌లు, సిగ్నల్ ముందు వెళ్లిన విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే శాఖ వెల్లడించింది. దీనిపై విచారణ జరుగుతోందని తెలిపింది.

You may also like

Leave a Comment