Telugu News » Traveller Ravi: గాలిలో 48 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన విశాఖవాసి

Traveller Ravi: గాలిలో 48 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన విశాఖవాసి

తాను తిరిగిన దేశాల్లోని ఎటువంటి వనరులుంటాయి? ఎలాంటి విద్యా, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనే విషయాలను కూడా తన వీడియోలలో చెప్తుంటారు.

by Prasanna
Ravi-Telugu-Traveller-1

విశాఖపట్టణానికి (Visakhapatnam) చెందిన యూట్యూబర్ (YouTuber) రవి ప్రభు (Raviprabhu) ప్రపంచంలోని 193 దేశాల్లో తిరిగిన అతి కొద్ది మందిలో ఒకరు. అమెరికాలోని ఐటీ ఏజెన్సీలో కన్సల్టెంట్‌గా పని చేస్తూనే…తనకు ఎంతో ఇష్టమైన ట్రావెలింగ్‌లో భాగంగా ప్రపంచ దేశాలను చుట్టేశారు.

Ravi-Telugu-Traveller-1

వివిధ దేశాల్లోని పరిస్థితులను, ఆయా దేశాల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను వివరిస్తూ…వాటిని వీడియోలు తీస్తూ యూ ట్యూబ్ లో పెడుతున్నారు. తాను తిరిగిన దేశాల్లోని ఎటువంటి వనరులుంటాయి? ఎలాంటి విద్యా, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనే విషయాలను కూడా తన వీడియోలలో చెప్తుంటారు.

ఈ నెల 11వ తేదీన లిబియా దేశం వెళ్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాలు, అనుభవాలు పంచుకున్నారు. మరో దేశం వెనిజులా కూడా త్వరలోనే వెళ్తున్నట్లు తెలిపారు. ఇంకా ఏమన్నారంటే…

Ravi-Telugu-Traveller-2

ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న…

“ఎప్పుడు ఎక్కడికెళ్లినా అందరూ నన్ను అడిగే ప్రశ్న ఒక్కటే…అసలు మీరెందుకు ఇన్ని దేశాలు తిరిగారని. దీనికి నేను చెప్పే సమాధానం ఒక్కటే. యువత ఎన్నో అనుకుంటారు. ఏవేవో కలలు కంటారు. నాకు ప్రపంచంలోని దేశాలన్ని తిరగాలనే ఆశ ఉండేది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరగాలి. అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అక్కడి ప్రజల జీవన విధానాలను తెలుసుకోలనే ఆలోచనే నన్ను ఇలా ప్రపంచం చుట్టూ తిరిగేటట్లు చేసింది.” అని ట్రావెలర్ రవి ప్రభు చెప్పారు.

Ravi-Telugu-Traveller-3

గాల్లో 48 లక్షల కిలోమీటర్లు…

నేను తిరిగిన దేశాల్లోని విశేషాలను వీడియోలు తీస్తూ వాటిని యూ ట్యూబ్ లో పెడుతుంటాను. వాటి ద్వారా కొంత ఆదాయం వస్తుంది. దానిని కూడా నా పర్యటనలకే ఖర్చుపెడుతుంటాను. ఇప్పటీ వరకు నేను తిరిగిన 193 దేశాల్లో దాదాపు 6 వేల హోటల్స్ లో బస చేశాను. నా పర్యటనల్లో భాగంగా నేను గాలిలో 48 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాను.

యూట్యూబ్ లో ఆదాయం ఓకే, కానీ…

యూట్యూబ్ లో నాకు ఆదాయం ప్రస్తుతానికి బాగానే వస్తుంది. కానీ ఇది ఎంత కాలం వస్తుందో చెప్పలేం. ఎవరైనా యూ ట్యూబ్ లో వచ్చే డబ్బులను నమ్ముకుని ఉద్యోగాన్ని వదిలేయకండి. అలాగే యూట్యూబ్ ఆదాయాన్నే ప్రధాన ఆదాయ వనరుగా చూడకండి.

You may also like

Leave a Comment