Telugu News » Aksha Parthasani: పెళ్లిపీటలెక్కిన యంగ్ హీరోయిన్..!

Aksha Parthasani: పెళ్లిపీటలెక్కిన యంగ్ హీరోయిన్..!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అక్ష పార్ధసాని(Aksha Parthasani) పెళ్లిపీటలెక్కింది. అయితే హీరోయిన్ కన్నా సెకండ్ హీరోయిన్ గానే బాగా ఫేమస్ అయ్యింది ఈ అమ్మడు. అయితే ఏడేళ్ల నుంచి టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ రాకపోడంతో తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు.

by Mano
Aksha Parthasani: The young heroine who got married..!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అక్ష పార్ధసాని(Aksha Parthasani) పెళ్లిపీటలెక్కింది. ఇప్పటి వరకు ఈ బ్యూటీ తెలుగులో యువత, రైడ్, కందిరీగ, బెంగాల్ టైగర్, శత్రువు, రాధా, డిక్టేటర్ వంటి సినిమాల్లో నటించింది. అయితే హీరోయిన్ కన్నా సెకండ్ హీరోయిన్ గానే బాగా ఫేమస్ అయ్యింది ఈ అమ్మడు.

Aksha Parthasani: The young heroine who got married..!

అయితే ఏడేళ్ల నుంచి టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ రాకపోడంతో తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఈ ముంబై భామ అక్కడే బాలీవుడ్ లో ఉంటూ అప్పుడప్పుడు పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. తాజాగా హీరోయిన్ అక్ష బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కౌశల్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది.

కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల్ని ఒప్పించి తాజాగా ఫిబ్రవరి 26 న పెళ్లి చేసుకున్నారు.. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి అంగరంగ వైభంగా జరిగింది. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, సన్నిహితులు, స్నేహితుల మధ్యే ఈ వివాహం జరిగి పెళ్లి ఫోటోలని అక్ష, కౌశల్ తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు.

అయితే ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కౌశల్ సినిమాటోగ్రాఫర్ కావడంతో షూటింగ్స్‌కు వాడే కెమెరా క్రేన్ మీద కూర్చొని పెళ్లిలోకి డిఫరెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అవ్వగా.. కెమెరామెన్ అనిపించుకున్నాడు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్ష, కౌశల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You may also like

Leave a Comment