Telugu News » TS RTC: ఆర్టీసీ సిబ్బందిపై దాడులను సహించం.. సజ్జనార్ ట్వీట్..!

TS RTC: ఆర్టీసీ సిబ్బందిపై దాడులను సహించం.. సజ్జనార్ ట్వీట్..!

ఆందోల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం బస్సు ఓ బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో ఆ బైక్‌పై ఉన్నవారు డ్రైవర్‌పై దాడి చేశారు. దీనిపై ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

by Mano
TS RTC: Attacks on RTC staff will not be tolerated.. Sajjanar's tweet..!

తెలంగాణ ఆర్టీసీ(TS RTC) సిబ్బందిపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్(RTC MD Sajjanar) ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా(Sangareddy District)లోని ఆందోల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం బస్సు ఓ బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో ఆ బైక్‌పై ఉన్నవారు డ్రైవర్‌పై దాడి చేశారు.

TS RTC: Attacks on RTC staff will not be tolerated.. Sajjanar's tweet..!

ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కార్మికులపై ప్రజలు విచక్షణరహితంగా దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందన్నారు.

అయినా తమ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తున్నారని వెనకేసుకొచ్చారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. తన తప్పేం లేదన్నట్లు దుర్భాషలాడుతూ డ్రైవర్‌పై దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం సహించదని సజ్జనార్ స్పష్టం చేశారు. ఆవేశంలో సిబ్బందిపై దాడిచేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దని సూచించారు. ఈ ఘటనపై ఆందోల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు డ్రైవర్‌పై దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment