తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Travel) సౌకర్యాన్ని కలిపించింది. ఇందులో భాగంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్స్ ఉచితంగా రాష్ట్రమంతటా ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ ఫ్రీ బస్సు సర్వీస్ కి, మహాలక్ష్మి పథకం అని నామకరణం కూడా చేసింది. మొదట్లో ప్రూఫ్స్ ఏవి లేకుండానే బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతులిచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఏదైనా ఐడీ కార్డు చూపించి ప్రయాణం చేయాలనే రూల్ పెట్టింది. అయితే ఏదైనా ఫ్రీగా వస్తే వదలరు కదా ! జనం..
ఈ క్రమంలో బస్సులో ప్రయాణం ఉచితం అనేసరికి మహిళలు ఎగడుతున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఆటోలు ఆటకెక్కగా.. ఆర్టీసీ (RTC) బస్సులు మాత్రం సందులేకుండా నిండుకొంటున్నాయి.. దీంతో బస్సుల్లో రద్దీ భారీగా పెరిగిందని అధికారులు వెల్లడించారు..ఇదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ తన చరిత్రలోనే ఆల్ టైం రికార్డు సాధించిందని అంటున్నారు అధికారులు.. ఆర్జీసీకి కూడా భారీగా రీయింబర్స్ ద్వారా లాభాలు వచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ అధికారుల సమాచారం ప్రకారం.. సోమవారం ఒక్కరోజే రూ. 21.11 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. కాగా రాష్ట్రంలో 97 డిపోలు ఉండగా.. సోమవారం నాడు దాదాపు 96 డిపోలకు భారీగా లాభాలు వచ్చినట్లు వారు వివరిస్తున్నారు. ఇలా జరగడం టీఎస్ ఆర్టీసీ (TS RTC) చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం అంటున్నారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 97.31 శాతానికి పెరిగినట్లు ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.
కాగా మహాలక్ష్మి పథకం వల్ల ప్రభుత్వం నష్టాల పాలవుతుందని భావించిన ప్రజలు.. లాభాల విషయం తెలిసి షాక్ అవుతున్నారని అధికారులు అంటున్నారు.. ఇక ముందు ముందు ఈ స్కీమ్‌లో ఆర్టీసీ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలని అనుకొనే వారు ఉన్నారు.. మరో వైపు ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకాలున్న దేశంలో ఉచితం అంటే ఎగబడక చస్తారా అని వాదించే వారు కూడా ఉన్నారు.. కానీ ఇప్పటికీ విషయం అర్థంగాక బస్సులన్నీ ఫ్రీ సర్వీస్ ఇస్తుంటే లాభాలు ఎట్లా వచ్చాయని కొందరు బుర్రలు బద్ధలు కొట్టుకొంటున్నారు..