Telugu News » TS RTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు..!

TS RTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు..!

సంక్రాంతి పండక్కి 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. జనవరి 6 నుంచి 15 వరకు హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు బస్సులు నడపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

by Mano
VC.Sajjanar: Alert for Pandakki pilgrims.. bus stops changed...!!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండక్కి 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. జనవరి 6 నుంచి 15 వరకు హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు బస్సులు నడపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

TS RTC: Good news for commuters.. 4,484 special buses for Sankranti..!

టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్(RTC MD VC Sajjanar) మీడియాతో మాట్లాడుతూ పండుగ సందర్భంగా ఎలాంటి పెంపుదల లేకుండా సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. అదేవిధంగా ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యమూ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రద్దీ ప్రాంతాల్లో బస్సులు ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికుల కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు.

బసవన్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా రద్దీ ప్రాంతాల్లో పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు త్వరగా గమ్యస్థానాలకు చేరుకునేలా టోల్‌ ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేశామన్నారు. అధిక ఛార్జీలు చెల్లించి ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించొద్దని, ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.

You may also like

Leave a Comment