Telugu News » TSRTC : మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్.. వారికి సెలవులు రద్దు..!!

TSRTC : మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్.. వారికి సెలవులు రద్దు..!!

మిగతా రోజులతో పోలిస్తే సాధారణంగా సోమవారం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఇవాళ కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న ఆర్టీసీ అధికారులు.. డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులు రద్దు చేశారు.

by Venu
ts rtc bus

తెలంగాణ (Telangana)లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మహిళలు, బాలికలకు ఆర్టీసీ (RTC) బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే.. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద ఈనెల 9 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. అయితే ఉచిత బస్సు ప్రయాణంతో, బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. గత ఆదివారం తో పోలిస్తే ఈ ఆదివారం బస్సుల్లో రద్దీ దాదాపు 15 శాతం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

మిగతా రోజులతో పోలిస్తే సాధారణంగా సోమవారం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఇవాళ కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న ఆర్టీసీ అధికారులు.. డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులు రద్దు చేశారు. సిబ్బందికి సెలవులు లేవని..విధులకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు.

మరోవైపు వేములవాడ (Vemulawada) కాళేశ్వరం, కీసరగుట్ట, రామప్ప వంటి శైవ క్షేత్రాలకు పెద్దసంఖ్యలో బస్సులు నడిపించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కాగా 31-32 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు సాధారణ రోజుల్లో నడుస్తుండగా.. సోమవారం ఆ సంఖ్య 34 లక్షల కిలోమీటర్లకు పెరుగుతుంది. ఇవాళ మరో 10 శాతానికిపైగా బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

You may also like

Leave a Comment