Telugu News » TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు..!

TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు..!

ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు. 19న వీఐపీ బ్రేక్‌(VIP Break) దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

by Mano
TTD: Ugadi beauty in temples.. special ceremony in Tirumala..!

టీటీడీ(TTD) తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా 19న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నందున ఆ రోజు వీఐపీ బ్రేక్‌(VIP Break) దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

TTD: Alert for devotees going to Tirumala.. VIP break darshans cancelled..!

ధర్మప్రచారంలో భాగంగా వేద సారాన్ని ప్రజలకు తెలిపేందుకు 2024, ఫిబ్రవరి మొదటి వారంలో సహస్రపురుష వేదస్వస్తి చతుర్వేద పారాయణం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో సదాభార్గవి అధికారులను ఆదేశించారు.

18వ తేదీన సిఫారసు లేఖలు స్వీకరించబోమని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 12.34గంటలకు ధనుర్మాసం ప్రారంభం కానున్నందున టీటీడీ స్థానిక ఆలయాల్లో ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మరోవైపు, తిరుమలలో చలి తీవ్రత పెగిపోయింది. ఇప్పటికే తిరుమల కొండలను పొగమంచు కమ్మేసింది. వర్షం తోడవడంతో పాపవినాశనం, శ్రీవారి మెట్ల మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కారణంగా ఘాట్‌రోడ్లలో సొంత వాహనాల్లో ప్రయాణించే వారిని అలిపిరి వద్ద టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేశారు. రహదారి మరమ్మతులు కొనసాగుతున్నచోట జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు.

You may also like

Leave a Comment