Telugu News » TTD: టీటీడీ ఉద్యోగులకు శుభవార్త.. పాలకమండల భేటీలో కీలక నిర్ణయాలు..!

TTD: టీటీడీ ఉద్యోగులకు శుభవార్త.. పాలకమండల భేటీలో కీలక నిర్ణయాలు..!

టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి(TTD Chairman Karunakar Reddy) అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో పాలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.

by Mano
TTD: Good news for TTD employees.. Important decisions in the governing body meeting..!

టీటీడీ(TTD) పాలకమండలి సమావేశం ముగిసింది. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి(TTD Chairman Karunakar Reddy) అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఇక, టీటీడీలో వివిధ దశల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త చెప్పారు.

TTD: Good news for TTD employees.. Important decisions in the governing body meeting..!

అటవీ కార్మికుల జీతాల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 15పోటు సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. రూ.4కోట్లతో 4, 5, 10 గ్రాముల తాళి బోట్టు తయారీ, నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయించామన్నారు. ఇకపై ప్రతీ ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి అవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించాలని పాలకమండలి నిర్ణయించినట్లు తెలిపారు.

అదేవిధంగా ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇకపై నిత్య సంగీతార్చన, తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణం చేపట్టనున్నట్లు నిర్ణయించామన్నారు. శ్రీవారి ఆలయంలోని జయ విజయాల వద్ద ఉన్న తలుపులకు రూ.1.69కోట్లతో బంగారు తాపడం చేయించనున్నట్లు వెల్లడించారు.

వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు రూ.8.16 కోట్లు, తిరుచానూరులో లైటింగ్‌కు రూ.3.89 కోట్లు, అలిపిరిలో వున్న గోశాల వద్ద రూ.4.12 కోట్లతో శాశ్వత యాగశాల నిర్మాణం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రూ.3.19 కోట్లతో సప్తగిరి అతిధిగృహం ఆధునీకరణ చేయనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా రూ.3.15 కోట్లతో తిరుమలలోని జలాశయాల్లో ఉన్న మోటార్ పంపులు మార్పు, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవిలకు నూతన బంగారు కవచాలు, రూ.15లక్షలతో వాహన తండ్లకు బంగారు తాపడం, అలిపిరి నడకమార్గంలోని ముగ్గుబావిని తాగునీటి అవసరాల కోసం ఆధునీకీకరణకు టీటీడీ ఆమోదం తెలిపారు.

You may also like

Leave a Comment