టీటీడీ పాలకమండలి (TTD Governing Council) భేటీ ముగిసింది. ఈ సందర్భంగా పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్(TTD Chairman) భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) మాట్లాడుతూ.. రూ.5141కోట్ల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు సహకరించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. టీటీడీ పోటు విభాగంలోని 70మంది ఉద్యోగులుకు స్కిల్డ్ లేబర్‌గా గుర్తిస్తూ వారి జీతాలను రూ.15వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలోని ఆరు వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను రూ.35 వేల నుంచి రూ.54 వేలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. వాటర్ వర్క్స్‌తో పాటు అన్నప్రసాదం, టీటీడీ స్టోర్స్‌లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల పెంచామన్నారు. అదేవిధంగా 56 వేదపారయణదారులు పోస్టుల నియామిస్తామన్నారు.
వేద పండితుల పెన్షన్ 10 వేల నుంచి 12 వేలకు పెంపు 34ఆలయాల్లో ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతికి విజ్ఞప్తి చేశామన్నారు. రూ.30 కోట్ల వ్యయంతో గోగర్భం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసలు నిర్మాణం చేసేందుకు అనుమతించినట్లు తెలిపారు.
నారాయణవనంలో వీర భద్రస్వామి ఆలయం అభివృద్ధికి 6.9కోట్లు, స్విమ్స్ అభివృద్ధికి రూ.148 కోట్లు, సప్తగిరి అతిథి గృహాల అభివృద్ధి పనులకు రూ.2.5కోట్లు, ఎస్ఎంసీ, ఎస్ఎస్సీ కాటేజీల అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు.