Telugu News » TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్…!

TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్…!

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana karunakar Reddy) మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ జీవో నెంబర్ 114 మేరకు టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తాం అని ఈ సందర్భంగా వెల్లడించారు.

by Mano
TTD: Key decision of TTD governing body... Good news for employees...!

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం టీటీడీ పాలక మండలి భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana karunakar Reddy) మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ జీవో నెంబర్ 114 మేరకు టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తాం అని ఈ సందర్భంగా వెల్లడించారు.

TTD: Key decision of TTD governing body... Good news for employees...!

అదేవిధంగా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాని అలిపిరి వద్ద 23వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు భూమన ప్రకటించారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.1000 చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుందని చెప్పారు. హోమాన్ని నిరంతరాయంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తామన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాల పేట వద్ద గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి రూ. 25.67 కోట్లు కేటాయింపునకు టీటీడీ పాలకమండలి ఆమోద ముద్రవేసినట్లు తెలిపారు.

టీటీడీలో ప్రతీ ఒక్క ఉద్యోగికి ఇంటి స్థలాలు కేటాయిస్తామని, తిరుపతిలోని రామ్‌నగర్ క్వార్టర్స్ అభివృద్ధి పనులుకు రూ.6.15 కోట్లు కేటాయిస్తామని టీటీడీ చైర్మన్ ప్రకటించారు. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ.14 వేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులుకు రూ.6,850 చెల్లిస్తామని తెలిపారు. ప్రాచీనకళలు ప్రోత్సహించడానికి కలంకారి, శిల్పకళలు కోసం కోర్సులు ప్రారంభిస్తామని చెప్పారు.

అదేవిధంగా ఆయుర్వేద హస్పిటల్‌లో రూ.1.65కోట్లతో నూతన భవనం నిర్మాణం, రుయాలో టీబీ రోగుల కోసం రూ.1.79 కోట్లతో నూతన వార్డు, స్విమ్స్‌లో రూ.3.35 కోట్లతో నూతన భవనాలు, రూ.74కోట్లతో నూతన కార్డియో, న్యూరో బ్లాక్‌ల ఏర్పాటు, రూ.197 కోట్లతో స్వీమ్స్‌లో నూతన ఆధునాతమైన భవనాలు నిర్మాణం, నడకదారిలో భక్తుల భధ్రత కోసం రూ. 3.5 కోట్ల వ్యయంతో ట్రాప్ కెమెరాల కోనుగోలుకు కేటాయించారు.

ప్రసాదాలు ముడిసరుకులు నిల్వ చేయడానికి రూ.11కోట్లతో అలిపిరి వద్ద గోడౌన్‌ల నిర్మాణం, రూ.15 కోట్లతో మంగళం నుంచి రేణిగుంట వరకు రోడ్డు అభివృద్ధి పనులు, రూ.4.5కోట్లతో ఎంఆర్ పల్లి జంక్షన్ నుంచి అన్నమయ్య వరకు రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పుదిపట్ల జంక్షన్ నుంచి వకులామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.21 కోట్లు కేటాయించారు. కరీంనగర్‌లో పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి రూ.15.54 కోట్లు టీటీడీ కేటాయించింది.

You may also like

Leave a Comment