Telugu News » TTD: టీటీడీ పాలక మండలి భేటీ.. 479 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్..!

TTD: టీటీడీ పాలక మండలి భేటీ.. 479 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్..!

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(TTD Chairman Bhumana Karunakar Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

by Mano
TTD: Big alert for Srivari devotees.. TTD's key decision at the time of election..!

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలి ఇవాళ(సోమవారం) కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(TTD Chairman Bhumana Karunakar Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

TTD: TTD Governing Council meeting.. Green signal for 479 posts..!

టీటీడీలోని అన్ని కళాశాలల్లో సిఫారసు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పనకు అదనంగా భవనాల నిర్మించాలని నిర్ణయించింది. అదేవిధంగా ఐటీ సేవలకు రూ.12కోట్ల నిధులను మంజూరు చేసింది టీటీడీ. శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీలోని పురాతన ఆలయాల మరమ్మతులకు ఆమోదం తెలిపింది. రూ.14కోట్ల రూపాయలతో 188 క్వార్టర్స్ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టింది.

గోవిందరాజ స్వామి ఆలయంలో బాష్యాకర్ల సన్నిధిలో మకరతోరణం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. యాత్రి సముదాయంలో లిఫ్ట్‌ల ఏర్పాటుకు రూ.1.88కోట్లు కేటాయించింది. అదేవిధంగా బాలాజీ నగర్ సమీపంలో ఫెన్సింగ్ ఏర్పాటుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది.

2014వ సంవత్సరానికి ముందు టీటీడీలో నియమింపబడిన కాంట్రాక్టు, పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫారస్సు చేసింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీవారి ఆలయ ఉద్యోగి నరసింహన్ కుటుంబానికి రూ.5లక్షల నష్ట పరిహారం ఇస్తున్నట్లు టీటీడీ చైర్మన్ ప్రకటించారు.

You may also like

Leave a Comment