Telugu News » TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. రమణ దీక్షితులుపై వేటు..!

TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. రమణ దీక్షితులుపై వేటు..!

తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై (Ramana Deekshitulu) టీటీడీ (TTD) వేటు వేసింది. ఈవో ధర్మారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో టీటీడీ సీరియస్ యాక్షన్ తీసుకుంది.

by Mano
Nothing on Ramana Dixituli. Nothing on Ramana Dixituli..!

తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై (Ramana Deekshitulu) టీటీడీ (TTD) వేటు వేసింది. రమణ దీక్షితులు.. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీటీడీ ఆయనపై చర్యలు తీసుకుంది.

Nothing on Ramana Dixituli. Nothing on Ramana Dixituli..!

తిరుమలలో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని, అన్యమతం విస్తృతంగా వ్యాపించిందని, నిధుల కోసం తవ్వకాలు జరుగుతాయి అంటూ రమణదీక్షితులు మాట్లాడినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్, సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి క్రిస్టియన్ అని, టీటీడీలో చాలా మంది క్రిస్టియన్లు ఉండటమే పెద్దసమస్య అని అన్నారు.

ఈవో కుమారుడు చనిపోతే దహనం చేయలేదని.. ఖననం చేశారని అన్నారు అంటూ టీటీడీపై, ఈవోపై రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే వీడియోలో అంశాలు భక్తుల మనోభావాలు దెబ్బతినేవిధంగా ఉన్నాయంటూ బీసీయూ అధినేత రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాకు రామచంద్రయాదవ్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఈ పరిణామాల మధ్య ఇవాళ(సోమవారం) జరిగిన టీటీడీ పాలకమండలి కీలక సమావేశంలో రమణ దీక్షితులుపై వేటు వేస్తున్నట్లు పాలకమండలి సంచలన ప్రకటించింది. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణదీక్షితులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని.. ఈ కారణంగా ఆయనను టీటీడీ నుంచి తొలగిస్తూ పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు.

 

You may also like

Leave a Comment