Telugu News » TSRTC : కండక్టర్‌పై దాడి కేసులో ఇద్దరికి జైలు.. ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ ట్వీట్ వైరల్!

TSRTC : కండక్టర్‌పై దాడి కేసులో ఇద్దరికి జైలు.. ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ ట్వీట్ వైరల్!

తెలంగాణ స్టేట్ రోడ్ అండ్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ ఎండీ సజ్జన్నార్ (TSRTC MD SAJJANNAR) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంటారు. ప్రజలకు రోడ్ సేఫ్టీ

by Sai
Is this much on one bike in Mandutenda? Sajjannar's shocking tweet went viral!

తెలంగాణ స్టేట్ రోడ్ అండ్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ ఎండీ సజ్జన్నార్ (TSRTC MD SAJJANNAR) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంటారు. ప్రజలకు రోడ్ సేఫ్టీ గురించి ఎల్లప్పుడూ అవగాహన కల్పిస్తుంటారు.రోడ్ మీద వెళ్లేటప్పుడు వాహనదారులు, పాదాచారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సూచిస్తుంటారు.

Two jailed in case of assault on conductor. RTC MD Sajjannar's tweet viral!

ఇక ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపట్ల కాస్త కఠువుగానే రియాక్ట్ అవుతూ ఉంటారు.రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రయాణ సంస్థ అభివృద్ధి కోసం ఆయన ఎన్నో చర్యలు చేపడుతున్నారు.రాష్ట్రంలో ఫ్రీ బస్ జర్నీ అమలులోకి వచ్చాక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు, సీటింగ్, టికెటింగ్ విషయంలో వెంటనే స్పందించి అధికారుల సాయంతో చర్యలు చేపడుతూ వచ్చారు.

ఇక ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల పట్ల ఎవరైనా ప్రయాణికులు, దుండగులు దురుసుగా ప్రవర్తిస్తే ఆయన అస్సలు సహించరు. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ (ఎక్స్)లో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

‘ప్రజల మధ్య విధులు నిర్వర్తించే ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే TSRTC యాజమాన్యం ఏమాత్రం సహించదు. సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా దాడులు, దౌర్జన్యాలకు దిగితే… బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తప్పవు. గద్వాల డిపోనకు చెందిన కండక్టర్ పై దాడి కేసులో ఇద్దరిక రెండేళ్లు జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకున్న పోలీస్, ఆర్టీసీ అధికారులకు TSRTC యాజమాన్యం అభినందనలు తెలియజేస్తోంది’ అని అన్నారు.

నిందితులకు శిక్ష ఖరారుకు సంబంధించి ఓ పేపర్ క్లిప్‌ను ఆయన జతపరిచారు. 2015 మార్చి 15న అలంపూర్ నుంచి కర్నూల్‌కు వెళ్తున్న బస్సులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణికులతో పాటు కండక్టర్‌తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అతనిపై దాడికి పాల్పడ్డారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు అలంపూర్ పోలీసులు చర్యలు చేపట్టగా నిన్న(బుధవారం) వారికి కోర్టు రెండేళ్ల జైలు, రూ.500 జరిమానా విధించింది.

You may also like

Leave a Comment