హైదరాబాద్లో ఘోరరోడ్డు (Road Accident) ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు(Software Engineers) అక్కడికక్కడే దుర్మణం చెందారు. మీర్పేట పోలీసుల కథనం ప్రకారం..శనివారం తెల్లవారుజామున గుర్రంగూడ చౌరస్తాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు స్పాట్ డెడ్ అయ్యారు.
ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు మీర్పేట పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతులు హైదరాబాద్లోని ఓ ప్రముఖ కంపెనీలో పనిచేసే రవి, ప్రణయ్గా గుర్తించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మీర్పేట పోలీసులు తెలిపారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు నిర్దారణకు వచ్చారు. రోడ్డు మీద వెళ్లేటప్పుడు వేగాన్ని సూచించే సైన్ బోర్డులను ఏర్పాటు చేసిన కొందరు యువత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల గురించి ఎన్నిమార్లు అవగాహన కల్పించినా కొందరు అతివేగంగా వాహనాలను నడిపి వారు ప్రమాదానికి గురవ్వకుండా కాకుండా అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఇటీవల హైదరాబాద్ మహానగరం పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదాల నివారణకు కొత్తగా చర్యలు తీసుకోబుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.