Telugu News » Sai Pallavi: ‘రామాయణం’లో సాయిపల్లవి.. భారీ రెమ్యునరేషన్ తీసుకోనుందా..?

Sai Pallavi: ‘రామాయణం’లో సాయిపల్లవి.. భారీ రెమ్యునరేషన్ తీసుకోనుందా..?

కంటెంట్ ఎక్కువగా ఉన్న పాత్రను ఎన్నుకొని సూపర్ హిట్స్ అందుకుంటోంది. ఇకపోతే బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తీస్తున్న రామాయణ(Ramayana) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

by Mano
Sai Pallavi: Will Sai Pallavi get huge remuneration in 'Ramayanam'?

నేచురల్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న సాయి పల్లవి(Saipallavi) తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కంటెంట్ ఎక్కువగా ఉన్న పాత్రను ఎన్నుకొని సూపర్ హిట్స్ అందుకుంటోంది. ఇకపోతే బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తీస్తున్న రామాయణ(Ramayana) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Sai Pallavi: Will Sai Pallavi get huge remuneration in 'Ramayanam'?

అయితే సాయి పల్లవి ఆ సినిమాలో నటించేందుకు భారీ రెమ్యునరేషన్(Remuneration) తీసుకుంటోందనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిగ్‌గా మారింది. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.2కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సాయిపల్లవి.. మూడు భాగాలుగా తీస్తున్న ‘రామాయణ’ కోసం మాత్రం రూ.10-15 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ ఇదే నిజమైతే స్టార్ హీరోయిన్ నయనతారను దాటేసి సాయిపల్లవి రికార్డ్ సృష్టించినట్లే అవుతుంది. సీత పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా తన పారితోషికాన్ని సాయిపల్లవి అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవి ప్రేమమ్ అనే మలయాళ సినిమాలో హీరోయిన్‌గా నటించి తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టింది. ఫిదా సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

తెలుగులో చివరగా విరాట పర్వం సినిమాలో నటించింది. రెండు సంవత్సరాల నుంచి నటనకు బ్రేక్ తీసుకున్న సాయిపల్లవి ఈమధ్య మళ్ళీ సినిమాలతో బిజీ కాబోతోంది. బాలీవుడ్‌లో రామాయణతో పాటు మరో సినిమాకు సైన్ చేసింది. అలానే రణ్ బీర్, యష్ తదితరులు నటిస్తున్న ‘రామాయణ’లోనూ సీత పాత్ర చేయబోతుంది. త్వరలో ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించనున్నారు.

You may also like

Leave a Comment