Telugu News » Blackman : రామ మందిర ప్రాణ ప్రతిష్ట… బీబీసీ తీరుపై బ్రిటీష్ ఎంపీ ఫైర్…!

Blackman : రామ మందిర ప్రాణ ప్రతిష్ట… బీబీసీ తీరుపై బ్రిటీష్ ఎంపీ ఫైర్…!

ఇటీవల అయోధ్య రామ మందిరం (Ram Mandhir)పై బీబీసీ పక్షపాత కవరేజిపై ఆయన మండిపడ్డారు.

by Ramu
UK MP Raises Concern Over BBCs Biased Coverage Of Ram Temple Opening

బీబీసీ (BBC)పై బ్రిటీష్ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బ్లాక్ మెన్ (Blackman) నిప్పులు చెరిగారు. ఇటీవల అయోధ్య రామ మందిరం (Ram Mandhir)పై బీబీసీ పక్షపాత కవరేజిపై ఆయన మండిపడ్డారు. ఈ ఏడాది జనవరి 22న రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి బీబీసీ తీరు సరిగా లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

UK MP Raises Concern Over BBCs Biased Coverage Of Ram Temple Opening

‘గత వారం యూపీలోని అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసి ప్రపంచ దేశాల్లోని హిందువులంతా చాలా సంతోషించారు. కానీ అయోధ్యకు వెళ్లిన బీబీసీ మాత్రం మసీదు ధ్వంసం అయిన స్థలంలో ఉన్నామని రిపోర్టు చేసింది. అంతకు రెండు వేల ఏండ్లకు ముందే అక్కడ ఆలయం ఉందనే విషయాన్ని బీబీసీ మర్చి పోయింది’అని తెలిపారు.

అయోధ్య నగరానికి పక్కనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించిన విషయాన్ని బీబీసీ మర్చిపోయినట్టుందన్నారు. ఆ స్థలంలో మసీదును నిర్మించనున్నారని పేర్కొన్నారు. బీబీసీ నిష్పాక్షిత, ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో సరైన రికార్డును అందించడంలో బీబీసీ వైఫల్యంపై యూకే పార్లమెంట్2లో చర్చించాలని కోరారు.

బీబీసీ కవరేజీపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయి. ఇదిలా ఉంటే ‘మన్ కీ బాత్’ 109వ ఎడిషన్‌లో అయోధ్యలో రామమందిరం ప్రాముఖ్యతను తెలిపారు. రామ మందిరం దేశాన్ని ఎలా ఏకం చేసిందో అనే విషయాన్ని దేశ ప్రజలు వివరించారు. రాముడి పరిపాలన రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

You may also like

Leave a Comment