Telugu News » UNGA: భారత్ పనితీరు అద్భుతం.. ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడి ప్రశంసలు..!

UNGA: భారత్ పనితీరు అద్భుతం.. ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడి ప్రశంసలు..!

ప్రపంచ వేదికపై భారత పోటీతత్వం పెరుగుతోందంటూ UNGA అధ్యక్షుడు డేనిస్‌ ఫ్రాన్సిస్‌ కొనియాడారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల సదుపాయాల్లోనూ భారత్‌ గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నాయని, దీంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని  చెప్పారు.

by Mano
UNGA: India's performance is excellent.. Praised by the President of the UN General Assembly..!

భారత్‌పై ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ (UNGA) అధ్యక్షుడు డేనిస్‌ ఫ్రాన్సిస్‌(Dennis Francis) ప్రశంసల జల్లు కురిపించారు. పేదరిక నిర్మూలన, కోట్లాది మంది ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయడంలో భారత్‌ పనితీరు అద్భుతమని కొనియాడారు. డిజిటలైజేషన్‌ను భారత్ సమర్థంగా వినియోగించుకుంటోందని ప్రశంసించారు.

UNGA: India's performance is excellent.. Praised by the President of the UN General Assembly..!

ఫ్రాన్సిస్ జనవరి 22-26 మధ్య భారత్‌లో పర్యటించిన ఫ్రాన్సిస్‌ విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జైపూర్‌, ముంబైలో పర్యటించి పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, మేధోసంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మహిళలు, రైతుల నుంచి ప్రతీఒక్కరు తామున్న చోటు నుంచే చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు.

తాజాగా ఆయన భారత్‌ పనితీరును మెచ్చుకున్నారు. ప్రపంచ వేదికపై భారత పోటీతత్వం పెరుగుతోందంటూ కొనియాడారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల సదుపాయాల్లోనూ భారత్‌ గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నాయని, దీంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని  చెప్పారు. కార్మికులకు నిరంతరం పని లభిస్తుందని చెప్పారు. వివిధ వస్తువులకు గిరాకీ పుంజుకుంటుందన్నారు.

తద్వారా ఆర్థిక వ్యవస్థ గణనీయ వృద్ధి నమోదు చేస్తుందని తెలిపారు. ఫోన్‌ లాంటి ఒక డివైజ్‌, డిజిటలైజేషన్‌ మోడల్‌తోనే ఇది సాధ్యమవుతోందని అభిప్రాయపడ్డారు. ఉత్పాదకతను పెంచడం, ఖర్చును తగ్గించడం, ఆర్థిక వ్యవస్థను సమర్థంగా మార్చడంలో డిజిటలీకరణ తోడ్పాటునందిస్తుందని తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధిని పర్యావరణ అనుకూల విధానాలతో ముడిపెట్టాలని సూచించారు. లేదంటే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించే ప్రమాదముందని ఫ్రాన్సిస్ హెచ్చరించారు.

You may also like

Leave a Comment