పార్లమెంట్ ఎన్నికలను (Parliament Elections) ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న బీజేపీ (BJP) అధిష్టానం ఔర్ ఏక్ బార్.. మోడీ (Modi) సర్కార్ అనే నినాదంతో ముందుకు వెళ్తుంది. దేశ వ్యాప్తంగా 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల రణరంగానికి సిద్దం అవుతుంది. ఈ నేపథ్యంలో గెలుపు అవకాశాలున్న నియోకవర్గంలో ఆచి తూచి వ్యవహరిస్తూ.. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గెలుపు గుర్రాలనే బరిలో నిలుపుతోంది..
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), మీరట్ (Meerut) పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకప్పుడు ఫేమస్ అయిన నటుడిని బరిలోకి దింపుతోంది. రామాయణం సీరియల్ (Ramayana serial)లో శ్రీరాముడి పాత్ర పోషించి అందరి గుండెల్లో స్థానం సంపాదించుకొన్న అరుణ్ గోవిల్ (Arun Govil)ను పోటీలో నిలిపింది. మరోవైపు మీరట్ నియోజకవర్గం నుంచి రెండు సామాజికవర్గాల నేతలు పోటీ పడుతున్నాయి..
ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం అనూహ్యంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.. అదేవిధంగా ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం అధికారికంగా కూడా ప్రకటించింది. ఇదిలా ఉండగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అమిత్ అగర్వాల్ సైతం మీరట్ టికెట్ ఆశించారు. కానీ, శ్రీరాముడిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించకొన్న అరుణ్ గోవిల్ వైపు మొగ్గు చూపింది.
అయితే అయోధ్యలో ఇటీవల రామాయలం ప్రారంభోత్సవంలో ఈ నటుడికి ప్రజలు హారతి పట్టిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో అరుణ్ గోవిల్ కి జనంలో ఫాలోయింగ్ ఉందని భావించిన అధిష్టానం ఇతని గెలుపు ఖాయమని భావిస్తున్నట్లు చర్చించుకొంటున్నారు..