Telugu News » Uttar Pradesh : ఉత్తర‌ప్రదేశ్‌లో నకిలీ మెడిసిన్స్.. ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ అధికారులు..!

Uttar Pradesh : ఉత్తర‌ప్రదేశ్‌లో నకిలీ మెడిసిన్స్.. ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ అధికారులు..!

శామీర్ పేట్, ఆస్పెన్‌ బయో ఫార్మా ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో సైతం అధికారులు దాడులు చేయగా.. పెద్దమొత్తంలో బ్యాన్ చేసిన రెండు డ్రగ్స్‌ లభించినట్లు తెలిపారు.

by Venu

తెలంగాణ (Telangana) డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (TDCA) అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా మెడిసిన్స్ (Medicines) తయారు చేసి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకొన్నారు. ఆపరేషన్ జై (Operation Jai) పేరుతో అధికారులు అక్రమంగా నడుపుతున్న మెడిసిన్స్ తయారీ కేంద్రాలపై ఏక కాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా పలు రకాల మందులు, మిషనరీని వారు స్వాధీనం చేసుకొన్నారు.

మరోవైపు గత నెలలో రాష్ట్రంలో ఖమ్మం, సంగారెడ్డి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నకిలీ ప్రాక్టిషనర్స్, అనుమతుల్లేని మెడికల్ షాపులను సీజ్ చేశారు. ఇందులో భాగంగా 150 రకాల యాంటీబెటిక్స్ డ్రగ్స్ ను అధికారులు గుర్తించారు. ఒక ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ ను సైతం అరెస్టు చేశారు. 2లక్షల 50 వేల మెడిసిన్లను సీజ్ సీజ్ చేశారు.

అంతేకాకుండా శామీర్ పేట్, ఆస్పెన్‌ బయో ఫార్మా ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో సైతం అధికారులు దాడులు చేయగా.. పెద్దమొత్తంలో బ్యాన్ చేసిన రెండు డ్రగ్స్‌ లభించినట్లు తెలిపారు. సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్ 110 కిలోలు, గాటిఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్ స్వాధీనం చేసుకొన్నారు. అయితే, ఇక్కడ లభించిన ఆధారాల మేరకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh), కోట్ద్వారలో తనిఖీలో చేపట్టారు.

ఈ తనిఖీలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు ఇక్కడి నుంచే మందులు సరఫరా అవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ మేరకు యూపీకి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు..

You may also like

Leave a Comment