Telugu News » V. Hanumantha Rao : తెలంగాణను అవమానించిన బీజేపీ.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు..!!

V. Hanumantha Rao : తెలంగాణను అవమానించిన బీజేపీ.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు..!!

అయోధ్య తర్వాత అంతటి చరిత్ర కలిగిన ఏకైక దేవస్థానం భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అని వివరించిన హనుమంతరావు.. దక్షిణ భారతదేశ అయోధ్యగా పిలవబడుతున్న ఈ దేవస్థానానికి ఆహ్వానం రాకపోవడం విచారకరమని పేర్కొన్నారు.

by Venu
V. Hanumantha Rao: CM Revanth should listen to our cry.

అయోధ్య (Ayodhya) రామాలయ ప్రారంభోత్సవానికి తాము రాలేమని కాంగ్రెస్‌ (Congress) అగ్రనేతలు ప్రకటించిన సంగత తెలిసిందే. అయితే ఈ విషయంలో హస్తం నేతలు ఒక్కో తీరుగా స్పందిస్తున్నారు. కొందరైతే ఈ వేడుకను పొలిటికల్‌ ఫంక్షన్‌ గా పేర్కొంటున్నారు. కాగా విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (V. Hanumantha Rao) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొన్న అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే వివక్షతో అయోధ్య నుంచి భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంకు ఆహ్వానం అందలేదని హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడు ముందు అందరూ సమానమేనని.. దైవం పేరుతో రాజకీయం తగదని తెలిపారు.

అయోధ్య తర్వాత అంతటి చరిత్ర కలిగిన ఏకైక దేవస్థానం భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అని వివరించిన హనుమంతరావు.. దక్షిణ భారతదేశ అయోధ్యగా పిలవబడుతున్న ఈ దేవస్థానానికి ఆహ్వానం రాకపోవడం విచారకరమని పేర్కొన్నారు. హిందువుల ఓట్లకోసం బీజేపీ ఇలాంటి నీచమైన ఆలోచన చేయడం సిగ్గు చేటని విమర్శించారు. తెలంగాణను ఈ విషయంలో అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment