Telugu News » New VB Trains : విమాన సౌకర్యాలతో మరో నాలుగు వందేభారత్ లు!!

New VB Trains : విమాన సౌకర్యాలతో మరో నాలుగు వందేభారత్ లు!!

భారతీయ రైల్వే శాఖ మరో అడుగు ముందు కేస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు సరికొత్త వందేభారత్ ను కానుకివ్వనుంది.

by sai krishna

భారతీయ రైల్వే శాఖ మరో అడుగు ముందు కేస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు సరికొత్త వందేభారత్ ను కానుకివ్వనుంది. రైళ్లలో సైతం విమాన సౌకర్యాలను కల్పించే విధంగా కొత్త ట్రైన్ లో విమానంలో ఉండే బ్లాక్బాక్స్(Blackbox)ను అమర్చుతున్నారు.


బంగాల్లోని చిత్తరంజన్ లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ(Chittaranjan Locomotive Coach Factory )లో మొదటిసారిగా ఈ తరహా ఇంజిన్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం నాలుగు వందేభారత్ రైల్ ఇంజిన్లు తయారు చేస్తున్నారు. సెప్టెంబర్లో ఇంజిన్లను తయారుచేసిన తరవాత, వాటిని చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో(ICF) పరీక్షిస్తారు.

అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. కొత్త వందే భారత్లో సీసీఆర్వీసీ అనే విమానంలోని బ్లాక్బాక్స్ తరహా సాంకేతికత ఉండనుంది.ఇది పైలట్ అన్ని కదలికలను గమనిస్తుంది.

వాటిని ఆడియో, వీడియో రూపంలో భద్రపరుస్తుంది. రైలు ఏదైనా ప్రమాదానికి గురైతే ఈ బ్లాక్ బాక్స్లోని సమాచారం ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను గుర్తిస్తారు.

చిత్తరంజన్ లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ దేబీ ప్రసాద్ మాట్లాడుతు..”గతంలో భారతీయ రైల్వే తయారు చేసిన WAP-5 కోచ్లు హై స్పీడ్ ఎలక్ట్రిక్ కోచ్లు. ఇప్పుడు వీటికి కొత్త రూపం ఇస్తున్నాం. ఇది ఏరో డైనమిక్ ఇంజిన్(Dynamic engine).

రైలు ముందు భాగం 20 డిగ్రీలుగా ఉండేది, ప్రస్తుతం దాన్ని 45 డిగ్రీలు ఉండేలా తయారు చేశాం.దీని వల్ల ఇంజిన్లో గాలి నిరోధకత తగ్గి, రైలు శక్తి, వేగం పెరుగుతుంది. కొత్త డిజైన్లో రైలు ముందు భాగంలో ఉండే గ్లాస్ను పెద్దదిగా ఉండేలా తయారు చేశాం. దీంతో డ్రైవర్ ప్రతిదీ మరింత స్పష్టంగా చూడగలడు.”

రైలుకు ముందు, వెనక రెండు ఇంజిన్లు ఉంటాయి. ఇవి ముందుకు, వెనక్కు ప్రయాణించేందుకు వీలుగా ఉంటాయి. రెండు ఇంజిన్లను ఒక పైలట్ మాత్రమే నియంత్రించగలిగే విధంగా సాంకేతికతను జోడిస్తున్నారు.

24 ప్యాసింజర్ కోచ్ లను లాగగలిగే సామర్ధ్యం ఈ ఇంజిన్లకు ఉంటుంది.ఒకే ట్రాక్ పై రెండు ప్రయాణిస్తే ఆటోమేటిక్ గా రైలు ఆగిపోతుంది. ఆధునిక సాంకేతికతతో కూడిన ఎయిర్ కండీషన్ డ్రైవర్ క్యాబిన్(Condition driver’s cabin).అయితే క్యాబిన్ లో మరుగుదొడ్డి సౌకర్యం లేదు

You may also like

Leave a Comment