తెలుగు బాషపై అభిమానం చూపించే భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu).. ఓనమాలు మాత్రమే నేర్చుకొంటే.. తెలుగు ఆనవాళ్లు ఉండవని హెచ్చరించారు.. తూర్పుగోదావరి (East Godavari) జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా కాకినాడ (Kakinada)లో రెండు రోజులపాటు అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు..

తల్లి లాంటి మాతృ భాష శతకాలు అలవాటు చేస్తే పిల్లలు బాగుపడతారని సూచించారు.. అదేవిధంగా తెలుగు భాషలో వస్తున్న మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తెలుగును కనుమరుగు కాకుండా బ్రతికించుకోవలసిన బాధ్యత నేటి యువతపై ఉందని తెలిపారు.. విదేశీ మోజులో పడి నేడు.. తెలుగు అంటే.. చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 45 ఏళ్లు విరామం లేకుండా రాజకీయాలు చేశానని గుర్తుచేసిన వెంకయ్యనాయుడు.. ఉప రాష్ట్రపతి అయిన తర్వాత రెస్ట్ తీసుకొనే అవకాశం వచ్చిందని తెలిపారు.