Telugu News » Venkaiah Naidu : తెలుగు భాషపై ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఉప రాష్ట్రపతి..!

Venkaiah Naidu : తెలుగు భాషపై ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఉప రాష్ట్రపతి..!

తల్లి లాంటి మాతృ భాష శతకాలు అలవాటు చేస్తే పిల్లలు బాగుపడతారని సూచించారు.. అదేవిధంగా తెలుగు భాషలో వస్తున్న మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తెలుగును కనుమరుగు కాకుండా బ్రతికించుకోవలసిన బాధ్యత నేటి యువతపై ఉందని తెలిపారు..

by Venu

తెలుగు బాషపై అభిమానం చూపించే భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu).. ఓనమాలు మాత్రమే నేర్చుకొంటే.. తెలుగు ఆనవాళ్లు ఉండవని హెచ్చరించారు.. తూర్పుగోదావరి (East Godavari) జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా కాకినాడ (Kakinada)లో రెండు రోజులపాటు అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు..

venkaiah naidu advice to students on mother toungeవంగూరి ఫౌండేషన్‌ (Vanguri Foundation) ఆఫ్‌ అమెరికా 30వ వార్షికోత్సవం సందర్భంగా.. కాకినాడ దంటు కళాక్షేత్రంలో జరుగుతోన్న ఈ సదస్సును నేడు ఆయ‌న ప్రారంభించారు.. ఈ సంద‌ర్భంగా వెంక‌య్య మాట్లాడుతూ, తెలుగు భాషలో వస్తున్న మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు భాష చాలా ఎబ్బెట్టుగా, వెటకారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వాలు దురదృవశాత్తు సాహిత్యాన్ని ప్రోత్సహించడం లేదని గుర్తు చేశారు..

తల్లి లాంటి మాతృ భాష శతకాలు అలవాటు చేస్తే పిల్లలు బాగుపడతారని సూచించారు.. అదేవిధంగా తెలుగు భాషలో వస్తున్న మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తెలుగును కనుమరుగు కాకుండా బ్రతికించుకోవలసిన బాధ్యత నేటి యువతపై ఉందని తెలిపారు.. విదేశీ మోజులో పడి నేడు.. తెలుగు అంటే.. చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 45 ఏళ్లు విరామం లేకుండా రాజకీయాలు చేశానని గుర్తుచేసిన వెంకయ్యనాయుడు.. ఉప రాష్ట్రపతి అయిన తర్వాత రెస్ట్ తీసుకొనే అవకాశం వచ్చిందని తెలిపారు.

You may also like

Leave a Comment