భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu), పద్మవిభూషణ్ అవార్డును (Padma Vibhushan) అందుకొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) చేతుల మీదుగా స్వీకరించారు. ఈయనతో పాటుగా సులభ్ శౌచాలయ సృష్టికర్త దివంగత బిందేశ్వర్ పాఠక్ బదులు ఆయన సతీమణి అమోలా పాఠక్, నటుడు మిథున్ చక్రవర్తి, కేంద్ర మాజీమంత్రి రామ్ నాయక్, గాయని ఉషా ఉథుప్ మొదలగు వీరిని పద్మభూషణ్ అవార్డు వరించింది.

అసాధారణమైన విశిష్ట సేవలు చేసినవారికి పద్మవిభూషణ్, ఉన్నతస్థాయి విశిష్ట సేవలు అందించిన వారికి పద్మభూషణ్, విశిష్ట సేవలు అందించినవారిని పద్మశ్రీ అవార్డులతో సత్కరిస్తోంది. ఇలా ఇప్పటి వరకు వివిధ రంగాలకు చెందిన మొత్తం 132 మందికి.. 2024లో కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 132 పద్మ పురస్కారాల్లో, 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి. ఇందులో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. అలాగే మరణానంతరం 9 మంది ఈ గౌరవం దక్కించుకొన్నారు..